Aamir bats for generic medicines before par panel

Aamir khan, Bollywood, FDI, Medicine, parliamentary panel, pharmaceutical, generic medicines

Actor Aamir Khan on Thursday appeared before a Parliamentary panel examining FDI in pharmaceuticals sector and pitched for generic medicines, saying companies will continue to make profit if they sell cheap drugs to the poor

Aamir bats for generic medicines before Par panel.gif

Posted: 06/22/2012 01:43 PM IST
Aamir bats for generic medicines before par panel

Aamir_khanఫార్మాసూటికల్ రంగంలో ఎఫ్‌డీఐలపై అభిప్రాయాలు తెలియజేసేందుకు బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ గురువారం ఓ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయ్యారు. జెనెరిక్ ఔషధాల విక్రయాలకు ఆయన పిలుపునిచ్చారు. పేదలకు చౌక ధరపై ఔషధాలు విక్రయించినా కంపెనీలకు నష్టమేమీ రాదని ఆమిర్ చెప్పారు. వైద్యవృత్తిలో అవకతవకలు, మందుల విక్రయాల్లో అక్రమాలను తన రియాలిటీ షో ‘సత్యమేవ జయతే’ ద్వారా బయటపెట్టిన ఆమిర్‌కు వాణిజ్యంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం నుంచి పిలుపు రావడం తెల్సిందే.

ఈ మేరకు ఆమిర్ కమిటీని కలిసి, ఫార్మా రంగంలో ఎఫ్‌డీఐలపై ఓ నివేదిక సమర్పించారు. జెనెరిక్ ఔషధాల విక్రయాలకు మద్దతిచ్చారు. చిన్న కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు ఫార్మా రంగంలో ఎఫ్‌డీఐలను క్రమబద్ధీకరించాలని ఆమిర్ సూచించినట్టు కమిటీ సభ్యుడొకరు తెలిపారు. కమిటీతో భేటీ అనంతరం ఆమిర్ మాట్లాడుతూ... జెనెరిక్ ఔషధాలపై ఎలాంటి సందేహాలూ అక్కర్లేదన్నారు. ఈ అంశంపై తాను వ్యాఖ్యానించడం పట్ల కొందరు వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై స్పందిస్తూ.. ‘ఈ సబ్జెక్టుపై లోతైన పరిశోధన చేశాకే మాట్లాడుతున్నా. పెద్ద కంపెనీల లక్ష్యం లాభార్జనే. అయితే, పేదలకు చౌక ధరపై ఎలా మందులు అందించాలన్నదే ఇక్కడ ముఖ్యం. కంపెనీలు చౌక ధరకు ఔషధాలు విక్రయిస్తే వాటికి భారీగా లాభాలు రాకపోవచ్చు గానీ లాభాలైతే వస్తాయి’ అని ఆమిర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  More water on the moon
Cbi jd was my classmate chandrabala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles