ర్యాంకు కోసం ఢిల్లీ లో పెద్ద రచ్చ జరిగింది. ప్రభుత్వ స్కూల్ లో చదువుకు విద్యార్థికి ఫస్ట్ ర్యాంకు రావటం పై పెద్ద రచ్చ ర్చ జరిగింది. కొన్ని కాలేజీ లు ఆ విద్యార్థి కోసం పోటీ పడి రచ్చ చేశాయి.బిటెక్‌లో జాతీయస్థాయిలో వచ్చిన మొదటిర్యాంకుపై వివాదం నెలకొంది. ఎఐఈఈఈ ఫలితాల్లోని బిటెక్ విభాగంలో ఢిల్లీకి చెందిన సందీప్‌పత్రీ మొదటిర్యాంకు సాధించారు. సందీప్‌పత్రీ ఢిల్లీ ప్రభుత్వస్కూల్ విద్యార్థి అని ఫలితాలు విడుదల చేసిన సిబిఎస్ఇ డైరెక్టర్ పత్రికలకు తెలిపారు. ఈ ప్రకటన ఢిల్లీ పత్రికల్లో వచ్చింది. అయితే ర్యాంకు సాధించిన సందీప్‌పత్రీ తన సంస్థలో శిక్షణ తీసుకున్నారని శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రకటించుకోవడంపై వివాదం చెలరేగింది. ప్రభుత్వస్కూల్లో చదువుకున్న విద్యార్థిని ఏ రకంగా తమ విద్యార్థిగా ప్రకటించుకుంటారని పలువురు విద్యావేత్తలు మండిపడుతున్నారు.
సందీప్పత్రీకి ఐఐటీలో వెయ్యి ర్యాంకు వచ్చింది. ఆ విషయాన్ని ఎవరు కూడా ప్రస్తావించలేదు. కానీ బిటెక్‌లో మొదటిర్యాంకు వచ్చిన తర్వాత శ్రీచైతన్య విద్యాసంస్థలు ప్రకటించుకోవడాన్ని తప్పుపడుతున్నాయి. ఇతర సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు మరో విద్యాసంస్థల్లో శిక్షణ తీసుకోవడం సహజమని, ఇలాంటివి ఐఐటిలోనూ కొనసాగుతోందని, సివిల్ సర్వీసెస్ ఫలితాల్లోనూ ఉంటాయని శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది. విద్యార్థి ర్యాంకుపై ఢిల్లీలో శ్రీచైతన్య విద్యాసంస్థలు రెండుసార్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఆ విద్యార్థి తమ దగ్గర శిక్షణ తీసుకున్నట్లు ఆ విద్యార్థి చెబుతారని అన్నారు. కాలేజీలో చదువుకున్న విద్యార్థికి ర్యాంకు వస్తే ప్రకటించుకోవాల్సి ఉన్నా ఇతర విద్యాసంస్థల్లో చదువుకున్న వారి ర్యాంకులను తమవిగా చెప్పుకోవడం తప్పుగా కొందరు అంటున్నారు. ర్యాంకులపై సిబిఐతో విచారణ చేయించాలని ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధుసూదనరెడ్డి డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more