Dimple yadav gets virtual walkover to lok sabha

Dimple Yadav gets virtual walkover to Lok Sabha,Dimple Yadav, wife of Uttar Pradesh Chief Minister, Akhilesh Yadav

Dimple Yadav gets virtual walkover to Lok Sabha

Dimple.gif

Posted: 06/09/2012 11:38 AM IST
Dimple yadav gets virtual walkover to lok sabha

Dimple Yadav gets virtual walkover to Lok Sabha

ఒక తండ్రి, ఒక కొడుకు , ఒక కోడలు పిల్ల . ఇది ఉత్తర ప్రదేశ్ రాజకీయం . గతంలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉండే. నేడు కొడుకు ముఖ్యమంత్రి గా ఉన్నాడు.  కొడుకుతో పాటు  రాజకీయంలోకి తన కోడలను కూడా  ఢిల్లీ సభకు పంపిన ఘనత ఒక్క ములాయంసింగ్ కే దక్కుతుంది.సాదాసీదా గృహిణిగా కనిపించే ఆమె ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే ఒక్కసారిగా లోక్‌సభలో పాగా వేస్తోంది.. దేశ రాజకీయాలకే గుండెకాయలాంటి ఉత్తరప్రదేశ్‌లో ఓ మాజీ ముఖ్యమంత్రి కోడలిగా, తాజా ముఖ్యమంత్రి భార్యగా ఆ రాష్ట్ర ప్రజలకు తెలిసిన ఆమె పోటీ లేకుండా ఎం.పి కాబోతోంది.. ఆమే- డింపుల్ యాదవ్. ఓ ఆర్మీ అధికారి కుమార్తె అయిన ఈమె యుపి మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఇంట కోడలిగా అడుగుపెట్టిన వేళ తాను రాజకీయాల్లోకి వస్తానని ఊహించి ఉండకపోవచ్చు.

తన భర్త అఖిలేష్ ఇటీవల ముఖ్యమంత్రి అయ్యాక డింపుల్ ఎంపీగా వెళ్లకతప్పడం లేదు. భర్త రాజీనామా చేసిన కనోజ్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలో డింపుల్ నిలిచారు. ప్రధాన పార్టీలు తప్పుకోవడంతో ఈమె ఎన్నిక లాంఛనప్రాయమే. తండ్రి ఉద్యోగరీత్యా భటిం డా, పూణె, లక్నో, అండమాన్-నికోబార్ దీవుల్లో ఈమె చదువు సాగింది. డిగ్రీ పూర్తిచేసిన ఈమెకు చిత్రకళలో మంచి ప్రావీణ్యం ఉంది. విపరీతంగా పుస్తకాలు చదివే డింపుల్‌కు రాజకీయాలంటే ఆసక్తి తక్కువే. అనుకోని పరిస్థితుల్లో ఈమె 2009లో భర్త అఖిలేష్ రాజీనామా చేసినపుడు తెరపైకి వచ్చారు. 2009లో ఫిరోజాబాద్ ఎంపి స్థానానికి పోటీ చేసిన డింపుల్ ప్రముఖ సినీనటుడు రాజ్‌బబ్బర్ (కాంగ్రెస్) చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో తమ కుటుంబానికి చెందిన మహిళలెవరూ రాజకీయాల్లో రాణించలేరని అప్పట్లో ములాయం వ్యాఖ్యానించారు. తొలిసారే ఓటమి చెందడంతో డింపుల్ రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని ఆనాడు అంతా అనుకున్నారు. అయితే, నేడు ఆమె ఎంపీ కాబోతుండడం ఎవరూ ఊహించని పరిణామం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sankar rao comments on jagan
Punjab govt to allow love inside jails  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles