Ysr congress party

YSR Congress Party, TDP party, Chandrababu naidu, Congress party, TdP MLA Revanth reddy, minister mopidevi venkata ramana , Jagan, Telugu yuvatha

YSR Congress Party

YSR Congress Party.gif

Posted: 05/18/2012 11:59 AM IST
Ysr congress party

YSR Congress Party

ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు పార్టీ నాయకులతో మంతనాలు జరిపారు. ఈ వ్యవహారం వల్ల జగన్‌పై సానుభూతి పెరిగే అవకాశం ఉందనే అంశంపై చర్చించారు. ఆస్తుల స్వాధీనం వ్యవహారంలో ప్రచారం తప్ప వాస్తవంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఒకవైపు ధ్వజమెత్తుతూ మరోవైపు ఆస్తులను మొత్తం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.  జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పెరుగుతుందా? లేక పార్టీ బలహీనపడుతుందా? అన్న ప్రశ్నలపై తెలుగుదేశంలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. జగన్ ఆస్తులను ఏ క్షణంలోనైనా స్వాధీనం చేసుకోవచ్చునని, జగన్‌ను అరెస్టు చేయవచ్చునని సాగుతున్న ఊహాగానాలపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టిడిపి నాయకులతో చర్చించారు.

కాగా, సానుభూతి పని చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు చర్చల అనంతరం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ అంశంపై వేరువేరుగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని ఖాతాలను మాత్రమే స్తంబింపజేయడం వల్ల ప్రభుత్వం సాధించేదేమీ లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. జగన్‌కు మొత్తం 19 ఖాతాలు ఉన్నాయని వాటిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేవలం ప్రచారం కోసమే ప్రభుత్వం హడావుడి చేస్తున్నదే తప్ప వాస్తవంగా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదని విమర్శించారు. జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకొని సంక్షేమ హ్టాస్టళ్ల పిల్లలకు వసతులు కల్పించాలని వర్ల రామయ్య కోరారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రివర్గానికి వెన్నుముక లేకుండా చేశారని విమర్శించారు. హడవుడిగా సంతకం చేశానని మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పడమే దీనికి సాక్షమని అన్నారు. జగన్ అస్తులను స్వాధీనం చేసుకోవాలని తెలుగు యువత నాయకులు బీద రవిచంద్రయాదవ్, మద్ద్భిట్ల సూర్యప్రకాశ్, ఎంవి సత్యనారాయణ రాజు విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tirupathi laddu
Really cyber wars that threaten global security  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles