అదేంటో తెలుసా.. శనివారం రాత్రి 11 గంటలకు మహిళల్లో శృంగారాసక్తి పతాకస్థాయికి చేరుతుందట. మహిళల్లో లైంగికాసక్తి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. కానీ, బ్రిటన్‌కు చెందిన విమెన్స్ హెల్త్ మేగజైన్ ఒక సర్వేద్వారా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేసి.. జవాబు రాబట్టింది. వెయ్యి మంది బ్రిటన్ మహిళలను ప్రశ్నించగా దాదాపు అంతా ఇదే సమాధానం చెప్పారు.
ఆ సమయంలోనే కోరిక ఎందుకు అధికం అనే ప్రశ్నకు శాస్త్రీయ కారణాలను వెతికే పనిలో నిపుణులు నిమగ్నమై ఉన్నారు. ఇదొక్కటే కాదు.. మహిళల లైంగిక వాంఛపై దేశవ్యాప్త సర్వే నిర్వహించిన ఆ మేగజైన్ అనేక గణాంకాలను వెల్లడించింది. ఆ సర్వే వివరాల ప్రకారం.. పడగ్గదిలో తాము పూర్తిగా సంతృప్తి చెందుతున్నామని స్కాటిష్ మహిళలు, బ్రిటన్‌లోని నైరుతి ప్రాంత మహిళలు (82 శాతం) చెప్పారు. ఇక.. ఐరిష్ మహిళల్లో ఈ సంతృప్త శాతం అతి తక్కువ (30 శాతం). కానీ విచిత్రమేంటంటే.. అందరికన్నా ఎక్కువసార్లు (వారానికి మూడుసార్లు) సృష్టికార్యంలో పాల్గొంటున్నది ఐరిష్ మహిళలేనని సర్వేలో తేలింది.
ఇలా పాల్గొంటున్నవారు 42 శాతం. వారి తర్వాతి స్థానాలు వరుసగా లండన్ (33 శాతం), వెల్ష్ (29 శాతం) మహిళలవి. కాగా.. సెక్స్‌లో పాల్గొనడానికి వారంలో ఏ సమయం అనుకూలం అనే అంశంపై పరిశోధన చేసిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గురువారం ఉదయం అయితే భేషుగ్గా ఉంటుందని గత ఏడాది తేల్చిచెప్పింది. శరీరంలో ఉండే జీవగడియారం అనుసరించే కొన్ని సూత్రాల వల్ల ఆ సమయంలో అయితే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్, పురుషుల్లో టెస్టోస్టీరాన్ స్థాయులు అత్యధికంగా ఉంటాయని అప్పట్లో వారు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more