Long working hours turning many into couch potatoes

Long working hours turning many into couch potatoes

Long working hours turning many into couch potatoes

working.gif

Posted: 05/08/2012 12:24 PM IST
Long working hours turning many into couch potatoes

it-companies1

మన దేశంలో 500కుపైగా ఐటీ సర్వీసుల్లో పనిచేసే నిపుణులు రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ఈ అంశంపై శరణ్‌ 2001 నుంచి 2009 వరకు అధ్యయనం నిర్వహించారు. 35 వేల మందిని సర్వే చేశారు. మీరు చాలా సమయం కూర్చొనే పని చేస్తున్నారా? అయితే తగిన వ్యవధిలో విరామాలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే నిరంతరం కూర్చోవడం, అస్తవ్యస్థంగా కూర్చోవడం వల్ల కళ్లకు ఇబ్బందే కాకుండా 'రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌' కలుగుతాయి. రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌ అంటే శరీర అవయవాలను అతిగా ఉపయోగించడం వల్ల కలిగే జబ్బు గ్రూపునకు చెందినవి. దీని వల్ల కండరాలు, టెండాన్లు, మెదడులోని నరాలు, నడుం పైభాగం, కింది భాగం, ఛాతి, భుజాలు, చేతులు ప్రభావితం అవుతాయి. చాలా సమయం పనిచేసి మెడ తిప్పడంలో ఇబ్బందిగా ఉన్నా, చేతి వేళ్లు, చేతుల్లో తరచూ నొప్పి కలుగుతున్నా తక్షణం వైద్యసహాయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న నొప్పుల్లాగా పెరిగి ఇవి క్రమంగా మన జీవనశైలిపై ప్రభావం చూపుతాయి. రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌ లక్షణాలు ఇలా ఉంటాయి. నొప్పి, మంటగా ఉండటం, మొద్దుబారిపోవడం, జలదరించడం, తలతిరగడం, దృఢంగా ఉండటం, వికృతంగా ఉండటం, వాపు ఉంటాయి. ఇలాంటి లక్షణాలున్నప్పుడు వెంటనే చికిత్స చేయించుకోవాలి, లేకుంటే ఇవి దీర్ఘకాలం వ్యాధుల్లాగా పరిణమిస్తాయని రికూప్‌ న్యూరోమస్కులోస్కెల్టల్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు చెందిన రిహాబిలిటేషన్‌ అండ్‌ ఎర్గొనామిక్స్‌ కన్సల్టెంట్‌ దీపక్‌ శరణ్‌ తెలిపారు.

Working-long-hours

ఇందులో 75 శాతం మంది రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యూరీస్‌తో బాధపడుతున్నవారే ఉన్నారని వెల్లడించారు. రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌ వల్ల మెడ, నడుం పైభాగంతో 60 శాతం మంది బాధపడుతున్నారు. నడుం కింది భాగం నొప్పితో 40 శాతం మంది బాధపడుతున్నారు. సర్వే చేసిన 20 శాతం మందిలో ఇవి సాధారణ జబ్బుల్లా మారాయి. నిరంతరం నొప్పి, మొద్దిబారిపోవడం వంటివి వీరిలో కనిపించాయి. అధ్యయనంలో పాల్గొన్నవారి వయసు 27 ఏళ్లు. ఈ సమస్య గుర్తించిన వారిలో చాలా మంది పురుషులే ఉన్నారు. అంతేకాక వీరు రెగ్యులర్‌గా పనిచేసే వారే. ఈ సమస్యలు కేవలం కంప్యూటర్‌పై కూర్చొని ఉద్యోగాలు చేసే వారికే కాదు, చాలా సమయం విరామం లేకుండా కుర్చీలో కూర్చోవడం వల్ల వస్తాయని అపోలో హాస్పిటల్‌లోని న్యురాలజిస్ట్‌ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

Weekend work change put on the backburner

సరైన భంగిమలో కూర్చోకపోవడం, విరామాలు లేకుండా కూర్చోవడం, తరచూ పనిచేయడం, పనిచేసే చోట, ఇంట్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌, చేస్తున్న ఉద్యోగం పట్ల అసంతృప్తి కూడా దీనికి కారణాలు. ఇలాంటి సమస్యలను టీచర్లు, జర్నలిస్టులు, రేడియో జాకీలు, దంతవైద్యనిపుణులు, నర్సులు, శస్త్రచికిత్స నిపుణులు, మసాజ్‌ చేసేవారు, పిల్లలు, గృహిణుల్లో ఈ వైద్యులు గుర్తించారు. ' అన్ని సంస్థలు పెద్దవి, చిన్నవి కూడా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. అంటే కంప్యూటర్‌ లేదా టేబుల్‌కు వారి ఎత్తుకు సరిపోయేటట్లు కుర్చీ, టేబుల్‌ను అమర్చడం, కూర్చునే భంగిమను నిర్దేశించే శిక్షణ ఇవ్వడం. పని మధ్యలో విరామాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించడం చేయాలి' అని శరణ్‌ సూచించారు. 'ప్రతి 5 నిమిషాలకు ఐదు సెకన్లు, ప్రతి 30 నిమిషాలకు రెండు నిమిషాలు తప్పనిసరిగా బ్రేక్‌ తీసుకోవాలని' తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New police controversy on gabbar singh movie
Rr moviemakers to promote new talent  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles