మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా జహీర్‌బాద్ వద్ద అతడిని అరెస్ట్ చేసినట్టు సమచారం. స్నేహితుడికి రాసిన లేఖల ఆధారంగా అతడి ఆచూకీ కనుగొన్నట్టు తెలుస్తోంది. భాను అరెస్ట్‌ను సీఐడీ ఐజీ రమణమూర్తి ధ్రువీకరించారు. సాయంత్రం 5.30 గంటలకు అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముందని పోలీసులు అంటున్నారు. గతేడాది జనవరి 3న సూరి హత్యకు గురయిన తర్వాత భాను పరారయ్యాడు. అప్పటినుంచి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. రెండుమూడు సార్లు అతడు దొరికినట్టు పుకార్లు వచ్చాయి. భాను నోరు విప్పితే సూరి హత్యకు గల కారణాలు వెలుగుచూసే అవకాశముంది.
తాము పట్టుకున్న ప్రదేశం నుంచి పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భాను కిరణ్ మారువేషాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాదు మధ్య తిరుగుతున్న సమయంలో గాలం వేసి పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం తన అనుచరుడు భాను కిరణ్ లేఖలు రాస్తూ వచ్చాడని, ఆ లేఖల ద్వారానే భాను కిరణ్ ఆచూకీ తెలిసిందని అంటున్నారు. సూరిని హత్య చేసిన తర్వాత భాను కిరణ్ పారిపోయాడు. ఆర్థిక లావాదేవీల కారణంగానే భాను సూరిని హత్య చేసినట్లు తెలుస్తోంది. సూరి భాను కిరణ్‌ను తీవ్రంగా వేధించాడని, దాన్ని తట్టుకోలేక భాను సూరిని హత్య చేశాడని చెబుతూ వస్తున్నారు. భాను కిరణ్ అరెస్టుతో అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
సూరితో పాటు కారులో వెనక సీట్లో భాను కిరణ్ వెనక సీట్లో కూర్చున్నాడని, ముందు సీట్లో ఉన్న సూరిని భాను కిరణ్ కాల్చి చంపాడని కారు డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. సూరికి భాను కిరణ్ ప్రధాన అనుచరుడిగా పనిచేస్తూ వచ్చాడు. సూరి జైలులో ఉండగా అతని పేరు మీద భాను కిరణ్ సెటిల్మెంట్లు చేస్తూ వచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఏడాదిన్నరగా పోలీసులను భాను కిరణ్ ముప్పు తిప్పలు పెడుతూ వస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more