Anam vivekananda reddy

Anam Vivekananda Reddy,Nellore MLA Anam Vivekananda Reddy,media cameras, peddling a riksha, laying a roa

Anam Vivekananda Reddy

Anam.gif

Posted: 04/18/2012 10:34 AM IST
Anam vivekananda reddy

Anam Vivekananda Reddy

నెల్లూరుకు ఆణిముత్యం లాంటి వాడు వివేకానంద రెడ్డి . ప్రజలకు ఆయన పెద్ద ఏమీ చేయకపోయిన ఆయన పాపులారీ పెంచుకోవటంలో వివేకానంద రెడ్డి మించిన వారు లేరు. ఆయన ఎప్పుడు ఏ వేషాలో కనిపిస్తోడోనని మీడియా వారు.. ఎదురుచూస్తు ఉంటారు. పదవి లేకుండా బంగీ అనంతయ్య అనే వ్యక్తి చంద్రబాబు పై కోపంతో.. అనేక వేషాలు వేస్తుంటారు. ఇప్పుడు అదే బాటలో పదవి ఉండి ప్రజలకు వింత వింత వేషాలతో కనిపిస్తూ హల్ చల్ చేస్తున్నారు. నిత్యం కొత్త కొత్త వేషాలతో ప్రజల ముందుకు వచ్చే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామీణ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మరో కొత్త అవతారం ఎత్తారు. నెల్లూరులో జరిగిన ప్రజాపథంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఆకర్షించేందుకు రిక్షా ఎక్కి తొక్కి హడావుడి చేశారు.

Anam Vivekananda Reddy

ఈ మధ్య ఖాకీ ఫ్యాంటు , తెల్లచొక్కాతో ప్రజాపధంలో కనిపించి డ్రస్పింగ్ లో తన వెరైటీ ఏంటో చూపించారు. తొలి రోజు బైక్ కూడా ఎక్కారు. అధికారులను తన వెంట పరుగులు పెట్టించారు. రెండో రోజు ప్లేస్ మారింది. ఆనం మరో వెరైటీ గెటప్ ఎత్తుకున్నారు. అదే రిక్షావాలా గెటప్. రాజస్థానీ తరహాలో తలపాగా పెట్టి చెమ్మాబొట్టు పెట్టుకున్నారు. చెక్కరిక్షా తొక్కుతూ రిక్షావాలాగా మారిపోయారు. ఇద్దరు చొక్కలేసుకున్న కాంగ్రెస్ తమ్ముళ్లందరినీ రిక్షాలెక్కించి దౌడ్ తీయించారు. సామాన్యులకు అందుబాటులో ఉండేందుకేనంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమం ప్రజాపథంలో ఆనం రిక్షాతో విన్యాసాలు చేయడంతో కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆనం వివేకానంద రెడ్డికి మరో శాసనసభ్యుడు శ్రీధర కృష్ణా రెడ్డి కూడా తోడయ్యారు. ఆనం రిక్షా ఎక్కి ఎంజాయ్ చేస్తుండగా శ్రీధర కూడా మరో రిక్షా తీసుకొని ఎక్కి తొక్కాడు. అయితే ప్రజాపథం కార్యక్రమానికి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలు ఇద్దరు ఎమ్మెల్యేలు రిక్షాతో స్టంట్స్ చేయడం గమనించి చెవులు కొరుక్కున్నారు.

Vivekananda_Reddy1

గతంలోనూ ఓ జ్యువెల్లరీ షాపుకెళ్లిన ఎమ్మెల్యే ఆనం, అక్కడ కూడా హల్ చల్ చేశారు. మహిళల ఆభరణాలూ, వడ్డాణం పెట్టుకుని తన ముచ్చట తీర్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh audio launch
Cm kiran kumar reddy and ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles