Bs yeddyurappa issues fresh deadline to make him karnataka cm

BS Yeddyurappa issues fresh deadline to make him Karnataka CM,India,Karnataka,politics,state politics,Karnataka political developments, BJPparty in-fighting

BS Yeddyurappa issues fresh deadline to make him Karnataka CM

Yeddyurappa.gif

Posted: 03/19/2012 12:07 PM IST
Bs yeddyurappa issues fresh deadline to make him karnataka cm

BS Yeddyurappa issues fresh deadline to make him Karnataka CM .

కర్ణాటకలో బీజేపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి సీఎం పదవిని అలంకరించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిననట్లు తెలుస్తోంది. ఆయన రేస్‌కోర్స్ నివాసంలో తనకు విధేయులైన కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన దాదాపు 55మంది మద్దతుదారులను కూడగట్టారు. సమావేశంలో మరో 15మంది మద్దతుదారులు వచ్చి చేరనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న బీజేపీ అధిష్ఠానం త్వరలోనే తన అభిష్టానికి అనుగుణంగా నిర్ణయంతీసుకుంటుందని యెడ్డీ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం 224మంది ఉన్న కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్‌తో కలిపి బీజేపీకి 120 సీట్లు ఉండగా ఇప్పటికే సగం మంది మద్దతుగా రానుండడంతో అతి త్వరలో అధిష్ఠానం సానూకూల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ‘‘4 గంటలు ఎదురుచూడండి. ఇది డెడ్‌లైన్‌కాదు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవకముందే తనను సీఎంగా పునర్నియమించడంపై నిర్ణయం వస్తుంది’’ అని యెడ్డీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. మార్చి 21న కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man attempts to make italian legal history by suing his wifes lover
Lagadapati rajagopal commrnts on by elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles