Ysr congress president jagan faces tough fight

ysr congress, president, jagan faces tough fight

ysr congress president jagan faces tough fight

3.gif

Posted: 03/18/2012 12:09 PM IST
Ysr congress president jagan faces tough fight

jaganతెలంగాణలో ఏదో వాదం పేరు చెప్పి ఉప ఎన్నికల పోరు నుంచి తప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి కోవూరు ఉప ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారింది.  ఈ ఒక్క స్థానం.. వ్యక్తిగతంగా జగన్‌కే కాకుండా, ఆయన పార్టీ భవిష్యత్తును నిర్దేశించనుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాల్లో ఐదింట తెలంగాణ వాదం పేరిట అభ్యర్థులను పోటీకి దించని జగన్ పార్టీ, శాసనసభ్యుడి మృతితో ఖాళీ అయిన మహబూబ్‌నగర్‌లోనూ అభ్యర్థిని నిలబెట్టలేదు.
మరోవైపు టీడీపీకి రాజీనామా చేసి, తమ పార్టీ అభ్యర్థిగా కోవూరు నుంచి పోటీ చేస్తున్న ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించుకోవటం ఇప్పుడు జగన్‌కు అనివార్యంగా మారింది. పైగా ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు స్థానాల్లో తాము పోటీ చేస్తున్న ఒకే ఒక్క స్థానం కోవూరే కావటంతో దానిని కూడా గెల్చుకోలేకపోతే.. పరువు పోతుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
 కడప ఉప ఎన్నికల తర్వాత చట్ట సభలకు సంబంధించి ఆ పార్టీ ఎదుర్కొంటున్న తొలి ఎన్నిక ఇదే కావటం కూడా ఒక కారణం.
కోవూరులో ప్రసన్న ఓడిపోతే ఒక రకంగా జగన్‌తో పాటు, ఆయన పార్టీకి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకుల భావన. ఈ విషమ పరీక్ష నుంచి యువనేత ఎలా గట్టెక్కుతారో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India vs pakistan cricket match today
By election poling in a full swing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles