Yeddyurappa queers the pitch to get top post

Yeddyurappa queers the pitch to get top post, Yeddyurappa,Sadananda Gowda government,Nitin gadkari,Belur Gopalakrishna

Yeddyurappa queers the pitch to get top post

Yeddyurappa.gif

Posted: 03/09/2012 11:14 AM IST
Yeddyurappa queers the pitch to get top post

Yeddyurappa queers the pitch to get top post

అక్రమ మైనింగ్‌ కేసుతో కర్నాటక మాజీముఖ్యమంత్రి యడ్యూరప్పకు హైకోర్టు నిన్న ''క్లీన్‌ చిట్‌'' ఇవ్వడంతో మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి ఆయన, ఆయన అనుచరులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి మార్పువిషయం బిజెపి కేంద్ర నాయకత్వం నిర్ణయించాల్సి ఉందని ముఖ్యమంత్రి డి.వి. సదా నంద గౌడ్‌ నేడు వ్యాఖ్యానించారు. యడ్యూరప్ప నిర్దోషి అని హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆయన తీర్పు కాపీలను బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కారీకి ఫొక్స్‌ చేశారు. ముఖ్యమంత్రి పదవి మళ్ళీ తనకు కట్టబెట్టాలని ఇటీవల యడ్యూరప్ప కేంద్ర నాయకత్వంపై తీవ్ర వత్తిడి తీసుకువచ్చారు. ఆయన వత్తిడికి తట్టుకోలేక గడ్కారి కేసు నుంచి నిర్దోషిగా బయటపడితే ఆ విషయం ఆలోచిస్తామని చెప్పిన విషయం విదితమే. యడ్యూరప్పకు తిరిగి పదవి అప్పజెప్పే ఈ విషయమై తాను ఏలాంటి వ్యాఖ్యలు చేయబోనని పార్టీ అధ్యక్షుడు గడ్కారి ఇటీవల బెంగుళూరు వచ్చినపుడు ఈ విషయంలో ఎవరూ బహిరంగంగా ప్రకటనలు చేయరాదని చెప్పారని అన్నారు.

కాగా, నిర్ధోషిగా బయటపడితే పదవి అప్పగిస్తామని కేంద్ర నాయకత్వం హామీ ఇచ్చినందునే యడ్యూరప్ప హైకోర్టు తీర్పు కాపీలను కేంద్ర నాయకత్వానికి పంపడం ద్వారా తన డిమాండ్‌ను గుర్తు చేశారని ఆయన అనుభవాలు చెపుతున్నారు. యడ్యూరప్ప తనపై కేసులు నమోదైన కారణంగా గత జూలైలో కర్నాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన విషయం విదితమే.లోకాయుక్త సంతోష్‌ హెగ్డీ అక్రమమై నింగ్‌లో యడ్యూరప్ప పాత్ర ఉందని చెప్పిన విష యాన్ని హైకోర్టు అంగీకరించలేదు. ఈ విషయంలో ఆయనపై ఒక్క కేసుకూడా నమోదైన దాఖలాలు లేవని హైకోర్టు పేర్కొన్నది. లోకాయుక్త నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయడాన్ని 'హైకోర్టు తప్పుబడుతున్న యడ్యూరప్ప తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వక పోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని కోర్టు అభిప్రాయ పడింది.

అక్రమ మైనింగ్‌కు అనుమతివ్వడానికి యడ్యూరప్ప తన అధికారాలు దుర్వినియోగం చేసి ఒక సంస్థ నుంచి తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడిచేట్రస్టుకు భారీగా ముడుపులు తీసుకున్నారని లోకాయుక్త నివేదిక ఇవ్వడంతో గవ ర్నర్‌ భరద్వాజ్‌ ఆయనను ప్రాసిక్యూట్‌ చేయడాన్ని అనుమతించారు. కోర్టు తీర్పున నుసరించి కేంద్ర నాయకత్వం త్వరలో నాయకత్వ మార్పు విష యంలో నిర్ణయం తీసుకోగలదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి బసవరాజ్‌ బొమ్మరు ఆశాభావం వెలిబుచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ias officer dies trying to stop illegal mining
More legislators involved in karnataka porngate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles