Mla jayasudha speaking at assembly

News,Andhra,Pradesh,National,Regional,Hyderabad,Current,Affairs,Rosaiah,Rajashekar,PRPChiranjeevi,TDP,Chandrababu,TRS,KCR,Loksatta,Jaya,Prakash,Narayana

News,Andhra,Pradesh,National,Regional,Hyderabad,Current,Affairs,Rosaiah,Rajashekar,PRPChiranjeevi,TDP,Chandrababu,TRS,KCR,Loksatta,Jaya,Prakash,Narayana

MLA Jayasudha speaking at Assembly.GIF

Posted: 02/29/2012 06:39 PM IST
Mla jayasudha speaking at assembly

Jayasudhaరాష్ట్రంలో రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ విభాగం వారు పెద్ద పెద్ద అక్షరాలతో ‘‘నిధానమే ప్రధానం’’ ’’వేగం కన్నా ప్రాణం మిన్నా‘‘ ‘‘అతి వేగం హాని కరం’’ అని పెద్ద పెద్ద బోర్డులు రోడ్డు ప్రక్కన పెడతారు. డ్రైవింగ్ చేసేవాళ్ళు మాత్రం వాటిని చూసి పాటించకుండా వెళ్ళి ప్రమాదాలకు గురవడం సహాజమైపోయింది.

తాజాగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ శాసన సభా సమావేశాలకు బయలుదేరి వస్తుంటే సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. దీనిని కళ్ళార చూసిన జయసుధ కలత చెంది అసెంబ్లీలో జరిగిన సంఘటన గూర్చి వివరంగా చెప్పారు. ఆ సంఘన వివరాల్లొకి వెళితే ... ఆమె అసెంబ్లీకి వస్తుండగా ఫిలిం నగర్ వద్ద.. నాలుగు చక్రాల వాహనమొకటి ఆమె కారు పక్కనుంచి వేగంగా దూసుకుపోయింది.  ఆ స్పీడును చూసిన జయసుధ.. 'ఇదేం డ్రైవింగ్ ఇంత రాష్‌గానా... ఎవరిని చంపడానికి వెళుతున్నట్లు' అని అనుకుంటుండగానే ఆ వాహనం కాస్తా వెళ్లి ఒక స్కూటర్‌ని ఢీకొందట. అప్పటికీ వేగం అదుపులోకి రాక ఒక చెట్టును ఢీకొని ఆగిపోయిందంటూ తన కళ్లముందు జరిగిన ప్రమాదం గురించి వివరంగా చెప్పారు. ఆ వాహనంలోంచి 19 ఏళ్ల యువకుడొకడు బయటకు వచ్చాడని, అందులో మద్యం బాటిళ్లు ఉన్నాయని చెప్పారు.

అయితే సికింద్రాబాద్ నియోజక వర్గ ప్రజలు మాత్రం ఎమ్మెల్యే జయసుధ తన కళ్ల ముందు జరిగిన సంఘటన అయితే అసెంబ్లీలో చెప్పింది కానీ, గత కొన్ని రోజుల నుండి తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నా ఆమె అసెంబ్లీలో చెప్పడంలేదని, తమ సొంత పనులు చూసుకోవడానికే జయసుధ సరిపోతుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Engineering student killed for being a topper
West bengal cms nephew arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles