Two fresh cases of swine flu reported in andhra pradesh

Two fresh cases of swine flu reported in Andhra Pradesh, situation,Swine flu,H1N1,Andhra Pradesh Swine Flu Cases,Andhra Pradesh

Two fresh cases of swine flu reported in Andhra Pradesh

swine flu.gif

Posted: 02/29/2012 10:38 AM IST
Two fresh cases of swine flu reported in andhra pradesh

Two fresh cases of swine flu reported in Andhra Pradesh

మహానగరంపై మరోసారి సైన్‌ఫ్లూ వ్యాధి పంజా విసిరింది. ప్రస్తుతం చలి కాలం నుంచి వేసవి కాలంలోకి వాతావరణం మారుతున్న నేపథ్యంలో రాత్రిపూట వాతావరణం కూడా చల్లబడిన కారణంగా ఈ వ్యాధి ప్రబలి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దగ్గు, జ్వరం వంటి సాధారణ అనారోగ్య లక్షణాలతో మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులకు ఈ వ్యాధి నిర్ధారణ కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులకు ఈ వ్యాధి నిర్థారణ అయిన విషయాన్ని కూడా ధృవీకరించలేని పరిస్థితిలో ఉన్నారంటే ప్రజారోగ్య పరిరక్షణకు వారు చేస్తున్న కృషిని అంచనా వేసుకోవచ్చు.

ఈ వ్యాధి నిర్ధారణ అయిన ఇద్దరు వ్యక్తులు కూడా నగర శివార్లకు చెందిన వారు కావటంతో ముఖ్యంగా గ్రేటర్‌లో విలీనమైన 12 మున్సిపాల్టీలకు చెందిన ప్రజల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. అయితే రాత్రివేళల్లో వాతావరణం చల్లగా ఉండటంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేగాక, వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నపుడు ప్రజలు సేవిస్తున్న తాగునీటి వల్ల కూడా స్వల్పంగా అనారోగ్యం తలెత్తే అవకాశాలున్నట్లు వాదనలు ఉన్నా, స్వల్ప అనారోగ్య లక్షణాలతోనే ఇద్దరు వ్యక్తులకు స్వైన్ ఫ్లూ నిర్థారణ కావటంతో ఏ మాత్రం జలుబు, దగ్గు వచ్చినా, నగర ప్రజలు స్వైన్ ఫ్లూ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
తాజాగా సైన్ ఫ్వూ వ్యాధి నిర్థారణ అయిన ఇద్దరు వ్యక్తులకు తొలుత కన్పించిన దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో పాటు జలుబు వంటి చిన్న చిన్న లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య శివార్లలోనే గాక, కోర్ సిటీలోనూ వందల్లోనే ఉంది. వీరంతా కూడా స్థానిక క్లీనిక్‌ల్లో చికిత్స పొందుతూ కాలం గడుపుతున్నారే తప్పా, సరైన వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవటం లేదు. చేయించుకునే ఆర్థిక స్తోమత కూడా వారికి లేకపోవటంతో దగ్గు, జ్వరం వంటి అనారోగ్య లక్షణాలు ఇప్పటికే స్పష్టంగా కన్పిస్తున్న నగరంలోని, శివార్లలోని వివిధ ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అనుమానాస్పద లక్షణాలు కల్గిన వారికి పరీక్షలు నిర్వహిస్తే గానీ పరిస్థితి చక్కబడే అవకాశం లేదు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arvind kejriwal talks reform but doesnt believe in voting
Jayaprada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles