మహిళల మీద దాడులు జరగటానికి వారి వస్త్ర ధారణ ఒక కారణమన్న డిజిపి దినేష్ రెడ్డి మాటలను నెలదాటినా ఇంకా వ్యాఖ్యలు చేస్తూనేవున్నారు. బస్సులో పై జేబులో కనపడేట్టుగా వెయ్యి రూపాయల నోట్లు పెట్టుకుని ఆ డబ్బుని పోగొట్టుకుంటే ఎవరైనా ముందుగా అనేది ఒకే మాట- జాగ్రత్తగా ఉండొద్దా అలా కనిపించేట్టు అంత డబ్బు పెట్టుకుంటావా అని. అంతమాత్రం చేత జేబు దొంగలను సమర్థించినట్టూ కాదు, అలా పెట్టుకున్నవాళ్ళ డబ్బులే పోతాయనీ కాదు. పర్స్ లో పెట్టుకున్నా, లోపలి జేబుల్లో పెట్టుకున్నా, ముంబై లాంటి నగరాల్లో లోదుస్తుల్లో దాచుకున్న నగదు ని కూడా కనిపెట్టే సమర్ధులున్నారు. మరి అవి పోయిన సంఘటనలున్నాయి కదా అంటే. సులభంగా తీసే విధంగా పెట్టుకోగూడదని, వీలయినంత జాగ్రత్త పడమని, లేకుంటే ప్రమాదాల్లో పడతారని పెద్దవాళ్ళ ఉద్దేశ్యం.
ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. పైగా సెలబ్రటీగా పిలిచినప్పుడు అక్కడంతా కళ్ళప్పగించి చూసేవాళ్ళు, వాళ్ళ మాటలను వినేవాళ్ళే ఉంటారు. భారత ప్రపంచ సుందరి సుంకవల్లి వాసుకి దినేష్ రెడ్డి మాటలను తప్పు పడుతూ, మగవారి ఆలోచనా విధానం సరిగ్గా లేకనే దాడులు జరుగుతున్నాయి కానీ వస్త్రధారణ వలన కాదు అని అన్నారు.
కానీ మన వస్త్ర ధారణ, చేసుకునే అలంకరణ, చివరకు మన సెల్ ఫోన్ రింగ్ టోన్ కూడా మన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. అసలు వస్త్ర ధారణ ఎందుకు చేసుకుంటాము అన్న మౌలిక ప్రశ్నలోకి పోతే నాగరికత ఎన్ని మార్పులు చేసుకుంటూ పోతోందో తెలుస్తుంది. వస్త్రాలు ధరించాలి, కానీ శరీర సౌష్టవం కనిపించాలి. ఆచ్ఛాదన ఉండాలి కానీ అంగసౌష్టవం అలరించాలి. ఇదీ ఈనాటి వస్త్ర ధారణా విధానం. అయినా తప్పు లేదు. నలుగురితో నారాయణ. కానీ ప్రత్యేకంగా వస్త్రాలను డిజైన్ చేసేవారి అవసరం ఎందుకు కలుగుతోందని ఆలోచిస్తే వారి శరీర అందాలను ఇనుమడింపజేయటానికే అన్న సమాధానం వస్తుంది.
నేరాలు జరగకుండా చూసే యంత్రాంగం ఉంది నిజమే కానీ మనం మన జాగ్రత్తలోనూ ఉండాలి. రెచ్చగొట్టి రెచ్చారు చూసారా అని అనటం కూడా సరైనది కాదు. అయితే అదొక్కటే కారణం కాదన్న విషయం మాత్రం నిజం. అదే దినేష్ రెడ్డి చెప్పింది కూడా. అలాగని ఈరోజు హైద్రాబాద్ వచ్చిన వాసుకి, మీడియాలో మాట్లాడిన మాటలను కూడా కొట్టిపారెయ్యటానికి లేదు. మగవాళ్ళు ఆలోచించే విధానంలో కూడా మార్పు రావాలి. ఇప్పటికీ స్త్రీలున్నది ఆకర్షించటానికే, సౌఖ్యాన్నివ్వటానికే అన్న ఆలోచన దురదృష్టవశాత్తూ ఇంకా సమాజంలో ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more