Reddys opposing kapus in ap cabinet

Reddys Opposing Kapus In AP Cabinet,Rajya Sabha member and senior Congress leader V,Senior Congress Rajya Sabha member V Hanumantha Rao met Azad,Kapu' community members

Reddys Opposing Kapus In AP Cabinet

Reddys.gif

Posted: 01/23/2012 05:24 PM IST
Reddys opposing kapus in ap cabinet

Reddys Opposing Kapus In AP Cabinet

రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలు 80 శాతం ఉన్నా.. ఓట్లు కూడా వారివే అయినా.. పదవుల విషయంలో గత 60 ఏళ్లుగా కాపులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ శాతంగా ఉన్న అగ్రవర్ణాలవారే పదవులు, పవర్‌లో ఉంటున్నారని, ప్రస్తుతం పదవులన్నీ వారికే ఉన్నాయని ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు బడుగు, బలహీనవర్గాలు చైతన్యవంతమయ్యాయని, పదవుల్లో వాటికి పెద్ద పీట వేయాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు అవసరం లేదని, ఉప ఎన్నికల తర్వాతే చేపట్టాలని అన్నారు. ఇప్పుడు కార్యకర్తలకు అవకాశం కల్పించాలని, కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యులను అపాయింట్ చేస్తే చంద్రబాబు, జగన్‌లపై వారే పోరాటం చేస్తారని వ్యాఖ్యానించారు. "రాక రాక ఇద్దరు కాపులకు పదవులు వస్తే.. ఇద్దరికి ఇస్తరా..?'' అంటూ దేశం మునిగిపోయినట్లు యాగీ చేస్తున్నారని ఎంపీ వి.హనుమంతరావు ధ్వజమెత్తారు.
బలహీన వర్గాలకు చెందిన వారిలో ఉన్న ఒక్క శంకర్‌రావునూ పదవి నుంచి తొలగించారని, హై కమాండ్ నిర్ణయం కనుక దాని గురించి తాము ఏమీ మాట్లాడడం లేదని చెప్పారు. యూపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ బడుగు, బలహీన వర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bank cheque
Amalapuram mp harshakumar fired on azad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles