సైనిక తిరుగుబాటుతో 1999 లో పాకిస్తాన్ లో ఏలుబడిలోకి వచ్చిన పర్వేజ్ ముషర్రఫ్ 2008 లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవటంతో అధ్యక్షుడి గద్దె దిగవలసి వచ్చింది. ఆ తర్వాత ముషర్రఫ్ ఏప్రిల్ 2009 నుంచి దేశం నుంచి బయటకు పోయి లండన్ దుబాయ్ దేశాల్లో తలదాచుకుంటున్నారు. 68 సంవత్సరాల సైనిక నియంత ముషర్రఫ్ తిరిగి తన పుట్టిన గడ్డ మీదకు రావాలని ఉబలాట పడుతుండగా, కాలు పెడుతూనే అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి వినపడుతున్న సందర్భంలో ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా రావద్దని సలహా ఇచ్చినందువలన ఆయన జనవరి 27, 30 తేదీల మధ్యలో వద్దామనుకున్న ఆలోచనను పక్కకుపెట్టినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ సంక్షోభంలో ముషర్రఫ్ వస్తే చక్కబడతాయేమోనని కొందరు సూచించగా ముషర్రఫ్ కరాచీ వెళ్ళటానికి ప్రణాళికవేసారు. అయితే ఈ సంగతి విన్న పాక్ హోం మినిస్టర్ మంజూర్ వాసన్, ముషర్రఫ్ ఇక్కడ అడుగు పెడితే జైలులోకి పోవలసిందే నని అన్నారు. బలూచిలో జరిపించిన మిలటరీ దాడిలో నేషనలిస్ట్ లీడర్ అక్బర్ బుగ్తి ని ముషర్రఫ్ చంపించారని ఆయన మీద అప్పుడే అభియోగంతో అరెస్ట్ వారెంట్ వెలువడింది. 2007లో బేనజీర్ భుట్టో ని చంపించిన ఆరోపణ తో కూడా ఆయన మీద మరో వారెంట్ ఉంది.
అయితే, ముషర్రఫ్ అధికార ప్రతినిధి సైఫ్, ముషర్రఫ్ భయపడే మనిషి కాదని అంటున్నారు. ఆయనెప్పుడూ కోర్టు నుంచి అభియోగాలనుంచి పారిపోలేదని, ఆయన రాగానే చట్టం ప్రకారం ఆయన హోదాని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించవలసి వుంటుందని అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more