All party meet to stop illegal liquor

All-party meet to stop illegal liquor. latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

All-party meet to stop illegal liquor. latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

All-party meet to stop illegal liquor.GIF

Posted: 01/02/2012 03:10 PM IST
All party meet to stop illegal liquor

కల్తీసారా ఘటన నేపథ్యంతో విపక్షాలన్నీ ఏకమై సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇంతవరకూ మద్యం మాఫియా అంటూ హోరెత్తిన ప్రతిపక్షాలకు కల్తీసారా మరణాలు మంరింత ఊపునిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో నాటు, కల్తీ సారా అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు అఖిలపక్షం నేతలు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు.

మద్యం నియంత్రణ ఉద్యమ కమిటీ పేరిట టీడీపీ నుంచి మండవ వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీజేపీ తరపున బండారు దత్తాత్రేయ, లోక్ సత్తా నుంచి కటారి శ్రీనివాసరావు ఇంకా జనవిజ్జాన వేదిక సభ్యులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న మద్యం మాఫియాకు అడ్డుకట్టవేయడానికి మద్యం నియంత్రణను అమలు చేయాలని సర్కారుకు విజ్ఝప్తి చేశారు. ఇందులో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా చర్య లు చేపట్టాలని వారు కిరణ్ ను కోరారు.  ఇందుకోసం కేరళ, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఎక్సైజ్ పాలసీ రూపొందించాలని సూచించారు.

కల్తీ కల్లు, నాటుసారా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపి పూర్తిగా నిర్మూలించాలని సైతం
నేతలు డిమాండ్ చేశారు. అంతేకాదు సర్కారు మద్యం అమ్మకాలను ఆదాయ మార్గంగా చూడకూడదని కోరారు. మద్యం సిండికేట్లపై ఏసీబీ గుర్తించిన అక్రమాలను బహిర్గతం చేసి సంబంధిత రాజకీయ పార్టీ నేతల్ని బహిష్కరించాలని కూడా అఖిలపక్షం నేతలు సీఎంకి విన్నవించారు.

తన పాలనాకాలంలో పొడచూపుతున్న క్లిష్ట సమస్యలను సైతం ఎంతో చాకచక్యంగా పరిష్కరిస్తోన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Terrorist who killed krishna prasad ips caught by police
Maoists encountered in bihar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles