ఈరోజు నుంచి ముంబై లో ఎమ్ఎమ్ఆర్ డిఏ మైదానంలో అన్నా హజారే దీక్ష చెపడుతున్నారు. ఉదయం జుహీ బీచ్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి ఆ తర్వాత మోటార్ బైక్ ర్యాలీ లో దీక్షాస్థలికి చేరుకుని దీక్ష సాగిస్తారు. మూడు రోజుల దీక్ష తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాసాల ముందు ధర్నా చేపడతారు. ఇదీ అన్నా కార్యక్రమ వివరణ. అయితే పార్లమెంటులో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఫలితం కోసం వేచి చూస్తే మంచిది కదా అని ప్రభుత్వం సూచించింది. పట్టూ విడుపూ ఉండాలి. మా మెడలు వంచే ప్రయత్నం చేస్తారా అని కొందరు నాయకులు అన్నా వైఖరి మీద మండిపడుతున్నారు. ఈరోజు నుంచి లోక్ పాల్ బిల్లు కోసం చర్చలు జరగబోతున్నాయి. ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చర్చల్లో పాల్గొంటారు. ఈ సందర్భంలో దీక్ష అవసరమా అని రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు.
అన్నా హజారే క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన వ్యక్తి. ఈ దీక్షా వివరాలు ఆయన ముందుగానే ప్రకటించారు. అయినా తాత్సారం జరుగుతూ, సాంకేతిక విషయాల్లో విషయమాన్ని క్లిష్టంగా చేస్తూ వస్తున్నారు. అన్నా ఈ ఏర్పాట్లను చెయ్యకపోతే అసలు శీతాకాలం సమావేశాల పొడిగింపు జరిగేదా. పార్లమెంటులో ఏ చర్చలూ జరగకుండానే సమావేశానికి కేటాయించిన సమయమంతా అయిపోయింది. సమావేశాన్ని పొడిగించారు అంటే అది కేవలం అన్నా హజారే భయం వల్లనే. చర్చల సమయంలో అందరూ హాజరవాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. అలాగే మిత్ర పక్షాలు కూడా వారి సభ్యులకు విప్ జారీ చెయ్యాలని కూడా కోరింది. ఇదంతా అన్నా పుట్టించిన వేడే కదా. అన్నా హెచ్చరికలు, కార్యకలాపాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
లోక్ పాల్ ఒక్కటే అన్నిటికీ సమాధానమా, మరే సమస్యా లేదా దేశంలో అంటే. దీన్ని పట్టుకున్నప్పుడు చివరివరకూ దీన్ని చూడాలిగా. ఈ ఒక్క దాన్నే పరిష్కరించలేని వారు, చర్చలతో ఒక సమాధానానికి రాలేనివారు మిగతా సమస్యలను గుర్తించినా ఏం చెయ్యగలుగుతారు. అందువలన ఒకే విషయాన్ని పట్టుకుని కూర్చున్నారని అన్నాను విమర్శించటం సరికాదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more