కోరికలు పెరిగిపోతున్నాయి, వాటిని తీర్చుకునే వనరులు లేకుండా ఉన్నాయి. ఉన్నది విద్యార్థి దశ, మనసులో పగ్గాలు తప్పుతున్న వాంఛలు. వాటికి దోహదం చేసే సినిమాలు, ఇతర వినోదాలు. గోవాకి పోయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఆకాంక్ష వెరసి వక్రమార్గంలో డబ్బు కూడ పెట్టే ప్రయత్నం. ఇదీ పోలీసులకు దొరికిపోయిన నలుగురు పాతబస్తీ విద్యార్థుల కథ. మహిళ మెడలో బంగారు గొలుసు కాజేయబోయి పట్టుబడ్డ ఒక విద్యార్థి వలన మిగతా అందరి బోగోతం బయటకు వచ్చింది. చిన్న చిన్న దొంగతనాలే కాకుండా ఇంటిలోకి సాహసించి జొరబడి చేసిన దొంగతనాలు, చిన్నా చితకా అన్నీ కలిపి 10 లక్షల రూపాయల విలుప చేసే బంగారం ఆ విద్యార్థుల దగ్గర దొరికింది. విలాసవంతమైన జీవితం కావాలంటే ముందు వారి విద్య పూర్త చేసి కష్టపడి సంపాదించాలనే ఙానం కాకుండా, తేరగా ఇప్పుడే ఆ కలను సాకారం చేసుకుందామనుకున్నందు వలన ఫలితం వారి జీవితంలోనే పడ్డ పెద్ద మచ్చ. పోలీసు రికార్డ్ లోకి ఎక్కిన వారి చరిత్ర వారి జీవితాన్ని ఇంకా పాతాళంలోకి నెట్టివేసింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more