ఈరోజు రేపు జరుగనున్న ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమావేశం జూబ్లీ హాల్లో ప్రారంభమైంది. సమావేశంలో ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పాలనలో కలెక్టర్ల పాత్రను కీలకమైనదిగా అభివర్ణించారు. సంవత్సరకాలంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలెక్టర్లతో నిర్వహించిన మొట్టమొదటి సమావేశమిది. ఎవరిమటుకు వారు పనిచేసుకుంటూ పోవటం కాకుండా సమన్వయం చాలా అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. కలెక్టర్లు, వారి కింది స్థాయివారు అంతా సమన్వయంతో పనిచేస్తూ, ఏమైనా లోటుపాట్లుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులకైనా పరిమితులున్నాయి కానీ కలెక్టర్లకు అన్నిచోట్లా అత్యంత గౌరవం, బాధ్యతాయుతమైన లక్ష్యం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పథకాలలో ముఖ్యంగా రైతులకు సాయపడేవాటిని, లబ్ధిదారులందరికీ సక్రమంగా అందుతున్నాయో లేదో చూడవలసిన బాధ్యత కలెక్టర్లదేనని, కలెక్టర్ల పనితీరే ప్రజల దృష్టిలో ప్రభుత్వచర్యలుగా కనిపిస్తాయి కాబట్టి పారదర్శకతను పాటిస్తూ పొరపాట్లు దొర్లితే వాటిని సరిదిద్దుకుంటూ పోవాలని చెప్తూ, ప్రభుత్వం ఇప్పటికే తీసుకునివచ్చిన వ్యవసాయదారులకు లాభాన్ని చేకూర్చే, వివిధ కార్యక్రమాలను, భవిష్యత్తులో రాబోతున్నవాటిని వివరిస్తూ, వాటిని సక్రమంగా అమలు జరిగేలా చూసే పని కలెక్టర్లదేనని అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి రఘువీరా రెడ్డి సమావేశానికి ముందుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో కలెక్టర్ల పాత్రమీద పూర్తిగా చర్చించటం జరుగుతుందని అన్నారు. రచ్చబండ, ఇతర కార్యక్రమాల్లో జరిగిన రసాభాసలు, ఆరోపణల గురించి అడగ్గా, అవన్నీ మాట్లాడి ఒక చక్కటి అవగాహనకు రావటానికే ఈ సమావేశమని రఘువీరా రెడ్డి అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more