రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగాల జాతర మొదలైంది. గత కొన్ని రోజుల క్రితం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లక్ష ఉద్యోగాలు ఇచ్చాకే మళ్ళీ ఓట్లు అడగటానికి వస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసినప్పటి నుండి దీని ప్రత్యేక కసరరత్తు చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఒకదాని తరువాత ఒకటి నోటీఫికేషన్ జారీ చేస్తున్నారు. ఇప్పటికే రెవిన్యూ, పోలీసు శాఖలను సంబంధించిన వాటి గురించి నోటిఫికేషన్లు ఇచ్చారు. తాజాగా రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టులకు ప్రకటన జారీ చేశారు. ఈ శాఖలోనే ఏకంగా 50 వేల ఉద్యోగాలకు మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది.
దీంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన పోస్టులతో పాటు, త్వరలో ఆమోదం రావాల్సిన పోస్టులను కూడా కలుపుకొని దాదాపు 50 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న లక్షా పదహారు వేల పోస్టుల భర్తీకి వీలుగా ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే డీఎస్సీ నోటిపికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ యాజమాన్యాలలోని పాఠశాలల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 11,500 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రీయ మాథ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఏ) కార్యక్రమం కింద ఉన్నత పాఠశాలలకు సుమారు 9,500, బాలల ఉచిత, నిర్భంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ఆయా పాఠశాలల్లో మొత్తం 38,355 టీచర్ పోస్టులు, రాష్ట్రంలో 2012-13 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్న 355 మోడల్ స్కూళ్ల కోసం 12 వేల పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో 7,100 పోస్టుల్ని రెగ్యులర్, మిగిలిన పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారు. వీటన్నింటిని కలిపి మొత్తం 50 వేలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకాబోతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more