Doctor couple commit suicide

bangalore doctor, bangalore suicide, family suicide,Doctor, couple,Bangalore, commit suicide,sons

A husband and wife, both doctors, and their two sons have committed suicide in Bangalore, reportedly by using drugs they had access to. The family was allegedly in serious debt

Doctor couple commit suicide.GIF

Posted: 12/03/2011 11:05 AM IST
Doctor couple commit suicide

Doctor-coupleతానొకటి తలిస్తే దైవమొకటి తలచింది. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్న ఆరాటం ఆ కన్న తండ్రిని అప్పుల ఊబిలోకి నెట్టింది. పేదలకు ఉచితంగా వైద్యం అందించే మంచి మనస్సున్న వైద్యుడు అందులోనుంచి బయట పడలేకపోయాడు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందిన  చోటే అప్పుల వాళ్ళ అవమానాలు ఎదుర్కోవడంలో తనువు చాలించడమే మేలని భావించిన ఆ వైద్యుడు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు.

బెంగుళూరు లోని చామరాజు పేట, వాల్మీకినగర్కు చెందిన డాక్టర్ అమానుల్లా ఖాన్(60) ఇక్కడి బుదికేరి నర్సింగ్ హోంను నిర్వహిస్తున్నాడు. భార్య డాక్టర్ హమీదాభాను (50)తో కలిసి శ్యామణ్ణగార్డెన్ లో లిమ్రా నర్సింగ్ హోం, విజయనగర్ లోని మరో క్లినిక్ ని నిర్వహిస్తున్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ అక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు.

అయితే తన కొడుకులను డాక్టర్లుగా చూడాలనే కోరికతో వారి చేతికి అందినంత అప్పులు చేశారు. పెద్ద కుమారుడు రషీద్ (28) ఎంబీబీఎస్ పూర్తి చేయగా, రెండో కుమారుడు హఫా రషీద్ (26) కూడా డాక్టర్ కోర్సు ఆఖరు సంవత్సరం చదువుతున్నాడు. వీరి కోసం దాదాపుగా 5 కోట్ల రూపాయల అప్పు చేశాడు. బ్యాంకుల నుండి, రుణదాతలను ఒత్తిడి పెరిగింది. వీటిని తీర్చ డానికి మార్గం కనిపించడపోవడంతో ఆ వైద్య కుటుంబం కుమారులతో సహా ఇంజక్షన్ తో విషం ఇచ్చుకొని మరణించారు. ఈ సంఘటన అక్కడి వారిని కలచివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teens sexual activity
Telangana talks after parliament session  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles