Fir against dmk leader mk stalin

stalin, dmk, jayalalitha, chennai, స్టాలిన్, డిఎంకె, జయలలిత, చెన్నై, national news, andhra pradesh

FIR was registered against DMK leader MK Stalin, his son Udayanidhi and four others in a land grab allegations.

FIR against DMK leader MK Stalin.GIF

Posted: 12/02/2011 02:57 PM IST
Fir against dmk leader mk stalin

Stalinతమిళనాడులోని జయలలిత ప్రభత్వం తన ప్రత్యర్థి కరుణాధి కుటుంబానికి షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. తాజాగా కరుణానిధి కుమారుడు స్టాలిన్, మరో నలుగురిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయింది. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, డిఎంకె నేత ఎంకె స్టాలిన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. అత్యంత ప్రధానమైన ప్రాంతంలో ఉన్న విలువైన భూములను అమ్మాలని బెదిరించారనే ఆరోపణలపై స్టాలిన్, ఆయనకు కుమారుడు ఉదయనిధిలపైన, మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్ఎస్ కుమార్ అనే వ్యక్తి నవంబర్ 29వ తేదీన చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఎఫ్ఐఆర్ నమోదైంది. తెయినాంపేటలోని చిత్తరంజన్ దాస్ రోడ్డులో గల తన భూమిని అమ్మాలని స్టాలిన్ అనుచరులు తనను బెదిరించారని అతను ఫిర్యాదు చేశాడు. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని స్టాలిన్ ఖండించారు. తప్పు సమాచార నివేదిక ఆధారంగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆయన విమర్శించారు. వాయిదా కోరకుండా న్యాయంగా దాన్ని ఎదుర్కుంటానని ఆయన చెప్పారు.

అత్యంత విలువైన భూమిని రూ .5.54 కోట్ల రూపాయలకే విక్రయించాలని స్టాలిన్ అనుచరులు బెదిరించారని కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు .ఆ ఫిర్యాదు మేరకు స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి, పి. వేణుగోపాల్ రెడ్డి, రాజా శంకర్, సుబ్బారెడ్డి, శ్రీనివాస్‌లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జయలలిత ప్రభుత్వం వచ్చిన తర్వాత భూకబ్జా కేసులను ప్రత్యేకంగా పరిశీలిస్తూ డిఎంకె నాయకులను ఒక్కరొక్కరినే అరెస్టు చేసుకుంటూ పోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India drops 11 places to 95th in corruption index
Aishwarya rai abhishek bachchan offered rs 5 crore for beti b s pictures  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles