Sabbam hari

Sabbam Hari attack babu , Chandra babu naidu, YSR Party, Jagan Sabbam hari, Jagan, Congress party, Jagan mohan reddy,

Sabbam Hari attack babu

Sabbam Hari1.GIF

Posted: 12/01/2011 02:04 PM IST
Sabbam hari

 Sabbam Hariకడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరు ఎటు వెళ్తున్నారనేది అసెంబ్లీలో తేలిపోతుందని ఎంపీ సబ్బం హరి చెప్పారు. ఆయన ఢిల్లీలో పార్లమెంట్ వెలుపల, ఆ తర్వాత విశాఖ విమానాశ్రయంలోనూ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కలగచేయడం లేదని, కొత్త ప్రభుత్వం, కొత్త నాయకత్వం రావాలని, ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వస్తుందా అనేది వేచిచూడాలన్నారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టినా ఓటింగ్‌కు వెళ్లడని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. పార్లమెంటు విడిచిపెట్టి రమ్మని జగన్ చెప్పిన మరుక్షణమే స్పీకర్ హౌస్‌లో రాజీనామాను ఆమోదింపచేయించుకుంటానని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అప్పటివరకు కాంగ్రెస్ ఎంపీగానే ఉంటానని, కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఓటు వేస్తానని తెలిపారు. ఓటు వేయడం ఇష్టం లేదనుకుంటే ఆ మరుక్షణం రాజీనామా చేసి వెళ్తానని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవుతుందని మీడియా ఇంటర్వ్యూలో చెప్పానని, ఇప్పుడు అదే జరిగిందని ఆయన గుర్తుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Peruvian gold mine suspended
Ram charan gets engaged to upasana today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles