Kcr make controversial comments on telangana

k chandrasekhar rao, sonia gandhi, kiran kumar reddy, ys jagan, telangana, hyderabad, andhra news, andhra wishesh, telugu wishesh

TRS chief K Chandrasekhar Rao make controversial comments on Telangana today in mlas meeting.k chandrasekhar rao, sonia gandhi, kiran kumar reddy, ys jagan, telangana, hyderabad.

KCR make controversial comments on Telangana.gif

Posted: 12/01/2011 10:00 AM IST
Kcr make controversial comments on telangana

KCRనేటి నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ఎల్పీ సమావేశంలో తెలంగాణపై మళ్ళీ కొత్తగా జోస్యం చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటు సమావేశాలు అయ్యేలోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని, త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేస్తుందనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ పంపే నివేదికలను సోనియా నమ్మడం లేదని ఆమె రాష్ట్ర పరిస్థితులపై ప్రయివేటుగా సర్వే చేయిస్తున్నారని చెప్పారు. సర్వే ఆధారంగా ఆమె నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ చిత్తశుద్థితో కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే తప్పకుండా మద్దతిస్తామని ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కెటి రామారావు సమావేశం సందర్భంగా మీడియాతో అన్నారు. అవిశ్వాసంపై బాబు తీరు దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందన్నారు. తనపై జరుగుతున్న సిబిఐ దర్యాఫ్తుపై బ్లాక్ మెయిల్ చేయడానికే అవిశ్వాసమని ఆరోపించారు. బాబు, కిరణ్ మాయావతిలాగా తెలంగాణపై తీర్మానం చేయాలని సూచించారు.

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను లెక్కలోకి తీసుకోని ఈ ప్రభుత్వాన్ని కూల్చడమే తమ లక్ష్యమన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం, పిడి యాక్టుల ఎత్తివేతకు డిమాండ్ చేస్తామని చెప్పారు. కేంద్రమంత్రి చిదంబరం వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాష్ట్రంలోని పార్టీలలో ఏకాభిప్రాయం వచ్చాక ఇక ఆయన ఎందుకన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No confidence notice submitted by tdp
Man lets loose snakes in up office  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles