Nagam janardhan reddy

MLa Nagam Janardhan reddy regained, Telangana, TRS party, Nadendla Manoha, Parlament speakar, congress Party,

MLa Nagam Janardhan reddy regained,

Nagam janardhanareddy.GIF

Posted: 11/18/2011 02:56 PM IST
Nagam janardhan reddy

nagamమహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ కు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నాయకుడు నాగం జనార్ధనరెడ్డి రాజీనామాను ఆకస్మికంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించడం వెనుక ఉన్న కద ఏమిటన్నది చర్చనీయాంశంగా ఉంది. నాగం జనార్దనరెడ్డి తెలుగుదేశం నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత టిడిపిపై విమర్శలు కురిపించారు. తదుపరి తెలంగాణ రాష్ట్రం సాధనకోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దానిని ఆమోదించాలంటూ ఆయన రకరకాల ఆందోళనలు చేపట్టారు.ఒకసారి ఏకంగా ఉపసభాపతి ఛాంబర్ లోకి వెళ్లి తలుపు వేసుకుని కూర్చున్నారు. ఆయనతోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ ఆందోళనలో పాల్గొన్నారు. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టుకు ఇచ్చిన పిటిషన్ లో తాను తెలంగాణ కోసం రాజీనామా చేశానని పేర్కొన్నారు. నిజానికి స్పీకర్ కావాలనుకుంటే ఆ పాయింట్ మీద రాజీనామాను తిరస్కరించవచ్చు. అయితే ఇప్పటికే పలుమార్లు తనపై ఒత్తిడి తెచ్చినందున నాగం రాజీనామాను ఆమోదించాలని ఆయన భావించారు. ఒకవేళ హైకోర్టు కనుక నాగం పిటిషన్ ను స్వీకరించి నోటీసులు జారీ చేస్తే అప్పుడు అది మొత్తం పెండింగులో పడే అవకాశం ఉంటుంది. ఒక దశలో అలా చేయాలని కూడా స్పీకర్ కార్యాలయం ఆలోచించిందని అంటారు.కాని ఆకస్మికంగా స్పీకర్ మనసు మార్చుకోవడం వెనుక కాంగ్రెస్ ,టిడిపిల రాయబారం కూడా ఉందని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. వచ్చే శాసనసభ సమావేశాలలో నాగం మళ్లీ తీవ్ర స్థాయిలో స్పీకర్ పైన,ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపైన విరుచుకుపడే అవకాశం ఉందని , తన రాజీనామా ఎందుకు ఆమోదించలేదని హంగామా సృష్టించే అవకాశం ఉందని , అందువల్ల ఆయన రాజీనామా ఆమోదిస్తే తమకు అభ్యంతరం లేదని పరోక్షంగా స్పీకర్ కు టిడిపి , కాంగ్రెస్ వర్గాల నుంచి సంకేతాలు వచ్చాయని, దానిని కూడా పరిగణనలోకి తీసుకుని స్పీకర్ నాగం జనార్ధనరెడ్డి రాజీనామాను ఆమోదించారని ఒక సీనియర్ నేత వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Villagers attack police station in chittore district
Robotic courses to be introduced in colleges  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles