The Biography Of Famous Teludu Lady Cartoonist Ragati Pandari | Cartoonists India

Ragati pandari biography lady cartoonist

Ragati pandari, Ragati pandari biography, Ragati pandari life story, Ragati pandari history, Ragati pandari special story, Ragati pandari photos, Ragati pandari cartoons, Ragati pandari wiki, telugu cartoonists, cartoonists in india

Ragati pandari biography lady cartoonist : The Biography Of Famous Teludu Lady Cartoonist Ragati Pandari.

వ్యంగ్య కార్టూనిస్టులలో కీర్తిప్రతిష్టలను పొందిన మహిళ

Posted: 07/28/2015 11:48 AM IST
Ragati pandari biography lady cartoonist

ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగి వుంటుంది. సరైన సమయంలో వారిలో వున్న ఆ ప్రతిభ లావాలా బయటికి పొంగుకొస్తుంది. దాంతో అప్పటివరకు సాగిన వారి సాధారణ జీవితాలు ఒక్కసారిగా మార్పు చెందుతాయి. ఆ ప్రతిభే వారికి దేశవ్యాప్తంగా తమకంటూ గుర్తింపును అందిస్తుంది. ఇలా ఈ విధంగా తన ప్రత్యేక ప్రతిభతో కీర్తిప్రతిష్టలను పొందిన వారిలో రాగతి పండరి ఒకరు. తెలుగు వ్యంగ్య చిత్రకారులు అయిన ఈమె.. కార్టూనిస్టులలో కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన ఏకైక మహిళ. చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా దెబ్బతిన్నప్పటికీ.. తన మానసిక చలాకీతనంతో చకచకా కార్టూన్లు గీసి అందరి మన్ననలు అందుకుంది. ఆమెలో వున్న లోపమే జీవితంలో ఏమైనా సాధించగలమని ఈమెకి మరింత బలాన్నిచ్చింది. ఆ బాధ నుంచి దూరంగా వుంటూ సంతోషాన్ని అన్వేషించిన బాటలో ఈమె వ్యంగ్య కార్టూన్లు గీయడం మొదలుపెట్టింది. ‘జీవితంలో వున్న వేదనని కాసేపు పక్కకు నెట్టి, నిండుగా నవ్వగలిగే శక్తినిచ్చే కార్టూన్లు మనిషికి గ్లూకోజు డోసులాంటివి’ అని పేర్కొన్న ఈమె.. ఆ దిశగా అందరినీ సంతోషపెట్టేందుకు తనదైన శైలిలో వ్యంగ్య చిత్రాలను గీశారు.

జీవిత విశేషాలు :

రాగతి పండరి 1965 జూలై 22వ తేదీన విశాఖపట్టణంలో రాగతి గోవిందరావు, రాగతి శాంతకుమారి దంతపతులకు రాగతి పండరి జన్మించింది. ఈమె చదువు ఇంటివద్దే కొనసాగింది. అతి చిన్నవయసులోనె పోలియో వల్ల వచ్చిన శారీరక లోపం వచ్చినప్పటికీ... ఈమె తన పట్టుదల, ఆత్మ విశ్వాసంతో, కఠోర పరిశ్రమతో కార్టూన్ రంగంలో అగ్రగణ్యుల సరసన చేరింది. ఈమె తన వ్యంగ్యచిత్ర ప్రస్థానాన్ని 1973లో తన 8వ ఏటనే మొదలు పెట్టింది. 1980-1990 దశకాలు ఈమెవే అని చెప్పవచ్చు. కొన్ని వేల వ్యంగ్య చిత్రాలను చిత్రించి పాఠకుల మీదకు వదిలింది. అన్ని ప్రముఖ వార, మాస పత్రికలలో ఈమె కార్టూన్లు ప్రచురించబడ్డాయి. ముఖ్యంగా పండుగల సమయంలో పత్రికల సంపాదకులు ఈమె కార్టూన్ల కోసం ఎంతగానో కోరుకుని, అడిగి మరీ తెప్పించుకుని తమతమ పత్రికలలో ప్రచురిస్తారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈమె కార్టూన్లు ఎంతటి వినోదాత్మకంగా వుంటాయో!

ఇదిలావుండగా.. సాధారణంగా కార్టూనిస్టులు ఇండియన్ ఇంకులో తమ క్రొక్వైల్ కలాన్ని ముంచి కార్టూన్లు వేస్తారు. కానీ రాగతి పండరి మాత్రం అందుకు భిన్నంగా వుంటుంది. ఆమెకు ఆలోచన వచ్చిందంటే చాలు.. వెంటనే తన దగ్గరున్న పెన్సిల్‌తో కాగితంపై కార్టూన్ వేసేస్తారు. ఆ క్రమంలో ఐదు పది నిమిషాల స్వల్పవ్యవధిలోనే కార్టూన్ గీసే విభిన్నమైన శైలి ఆమెది. ఇటువంటి విభిన్న శైలి కలిగి వుండటం వల్లే ఈమె కార్టూన్ రంగంలో వేగంగా తనదంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోగలిగారు. ఒకప్పుడు కార్టూన్లలో ఆడవారిని ఒక మూసలో ఇరికించి.. ఒక గయ్యాళి భార్యగానో, అత్తగారిగానో వేయటం పరిపాటిగా వుండేది. కానీ రాగతి పండరి అటువంటి మూసను అధిగమించి, ఆడవారిని తన వ్యంగ్య చిత్రాలలో అనేక ఇతర పాత్రలను సృష్టించి, చూపించారు. కుదురైన చక్కటి చిత్రీకరణ, గుండ్రటి చేతివ్రాత, తేట తెలుగులో సంభాషణలు ఈమె వ్యంగ్య చిత్రాల ప్రత్యేకత.

రాగతి పండరి వేసే రాజకీయ వ్యంగ్య చిత్రాలలో, నీజమైన రాజకీయ నాయకుల చిత్రాలు ఉండవు. ఊహాజనిత రాజకీయ నాయకులను మాత్రమే చిత్రిస్తారు. మానవ ప్రవృత్తిలో ఉన్న ద్వంద్వ అలోచానావిధానం, సాఘిక దురాచారాలు, వీరి కార్టూన్లలో నిసితంగా విమర్శించి, హాస్యం ప్రధానంగా, ఆకర్షణీయంగా ఉండి, పాఠకులను నవ్వులలో ముంచెత్తటమే కాకుండా, ఆలోచించటానికి కూడ ఉద్యుక్తులను చేస్తాయి. ఈమె తన ప్రతిభకు గాను.. 1991లో రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టరు చేతుల మీదగా ‘ప్రశంసా’ బహుమతి అందుకున్నారు. 2001లో ఉగాది పురస్కారం ఆంధ్ర ప్రదేశ్ అప్పటి గవర్నర్ సి.రంగరాజన్ చేతులమీదుగా అందుకున్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఈమె ఫిబ్రవరి 19, 2015 (వయసు 49)న విశాఖపట్టణంలో మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ragati pandari  Cartoonists  

Other Articles