The Biography Of Nafisa Joseph | Indian Famous Models | Suicide Case | Crime news

Nafisa joseph biography indian famous model suicide case

Nafisa Joseph, Nafisa Joseph death mystery, Nafisa Joseph life story, Nafisa Joseph biography, Nafisa Joseph history, Nafisa Joseph wikpedia, Nafisa Joseph photos, Nafisa Joseph modelling, Nafisa Joseph career, Nafisa Joseph serials, kuljit randhawa

Nafisa Joseph Biography Indian Famous Model Suicide Case : The Biography Of Famous Indian Model Nafisa Joseph Who Won Miss India Universe In 1997.

‘1997 మిస్ ఇండియా యూనివర్స్’ టైటిల్ గెలిచిన మోడల్

Posted: 07/29/2015 06:26 PM IST
Nafisa joseph biography indian famous model suicide case

మోడలింగ్.. స్త్రీలకోసం ఏర్పడిన ఈ ప్రత్యేక ప్లాట్ ఫార్మ్ ఎందరికో సక్సెస్ ఫుల్ కెరీర్ ని అందించింది. ఈ వేదిక కేవలం అందానికి సంబంధించిన పోటీలను నిర్వహించడమే కాకుండా స్త్రీలో దాగివున్న ప్రతిభను వెలికితీస్తుంది. అందుకే.. కాలక్రమంలో ‘మోడలింగ్’ విభాగానికి ప్రజాదరణ పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ పోటీల్లో పాల్గొనే అమ్మాయిల మధ్య పోటీ కూడా తారాస్థాయికి పెరిగిపోయింది. రకరకాల పేర్లతో నిర్వహించబడే ఈ మోడలింగ్ పోటీలు 90వ దశకంలోనూ ఎక్కువగానే వుండేవి. అటువంటి రోజుల్లో కూడా కొందరు భారతీయ మహిళలు తమ టాలెంట్, అందంతో కిరీటాల్ని సొంతం చేసుకున్నవారున్నారు. అలాంటివారిలో నఫీసా జోసెఫ్ ఒకరు. ఇండియన్ మోడల్ అయిన ఈమె.. 1997 ‘మిస్ ఇండియా యూనివర్స్’ విజేతగా గెలవడంతోపాటు అదే సంవత్సరంలో ‘మిస్ యూనివర్స్’ పోటీల్లోనూ సెమీ-ఫైనలిస్ట్ గా నిలిచారు.

జీవిత విశేషాలు :

1978 మార్చి 28వ తేదీన బెంగుళూరు నగరంలో నిర్మల్ జోసెఫ్, ఉషా జోసెఫ్ ఇద్దరు దంపతులకు నఫీసా జోసెఫ్ జన్మించింది. ఈమె బెంగుళూరులోనే బిషప్ కాటన్ స్కూల్లో, సెయింట్ జోసెఫ్ కళాశాలలో విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. ఈమె కాథలిక్ అయినప్పటికీ కూడా ఈమె పేరులోని మొదటి పదం ఇస్లామిక్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే.. ఈమె తండ్రి తరపు బామ్మ ముస్లిం కావడంతో.. ఆమెకు ఆ పేరు పెట్టారు. బాల్యం నుంచే ఎంతో చురుకుగా వుండే ఈమెకు.. మోడలింగ్ లో అనుకోకుండా అవకాశం వరించింది. ఈమెకు తన 12వ ఏటలోనే ఓ ప్రకటనకి మోడల్ గా అవకాశం రావడంతో అక్కడి నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగించింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు దూసుకెళ్లింది. ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయకుండా తన సత్తా చాటుకుంది.

మోడలింగ్ కెరీర్ :

జోసెఫ్ 12వ ఏటలో వున్నప్పుడు ఈమె పొరుగింటివారు ఒక వేర్ హౌస్ ప్రకటనకి అవకాశం ఇప్పించారు. ఆ ఆఫర్ తో ఈమె మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఈమె అందానికి, టాలెంట్ కి ఫిదా అయిన ప్రసాద్.. జోసెఫ్ ని మోడలింగ్ లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాడు. అతని ప్రోత్సాహంతోనే ఈమె మోడల్ గా ఎదిగింది. మోడలింగ్ లో క్రిందిస్థాయి పోటీల నుంచి గెలుపొందుతూ తన ప్రతిభ చాటుకుంది. ఈ క్రమంలోనే ఈమె 1997 మిస్ ఇండియా యూనివర్స్ పోటీల్లో గెలుపొందింది. ఆ పోటీల్లో పాల్గొన్న ఇతర మోడల్స్ కంటే జోసెఫ్ చిన్నది. ఆ టైటిల్ విజయంతో ఈమె దశ పూర్తిగా తిరిగిపోయింది.

1999లో ఈమె MTV ఇండియా VJ పోటీకి న్యాయనిర్ణేతగా ఎన్నుకోబడింది. ఈమె MTV హౌస్ ఫుల్ షోని సుమారు ఐదేళ్ళపాటు నడిపింది. ఈమె C.A.T.S టీవి కార్యక్రమంలో సోనీ ఎంటర్టైన్మెంట్ టీవికి నటించింది. 2004లో స్టార్ వరల్డ్ లో ‘స్టైల్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈమె తన కాబోయే భర్త గౌతమ్ ఖండుజా సహకారంతో టీవి ప్రోగ్రామింగ్ విభాగ కంపెనీ ‘2'స్’ ని కూడా ప్రారంభించింది. ఈమె ‘గర్ల్జ్’ అనే మాగజైన్ ని ఎడిట్ చేసింది. అంతేకాదు.. ఈమె జంతు ప్రేమికురాలు కూడా. కుక్కల సంరక్షణ కోసం ప్రచారం నిర్వహించింది. రెండు జంతుసంరక్షణ సంస్థలకి ప్రచారం నిర్వహించి, నఫీసా ఫర్ యానిమల్స్ అనే పేరుతో ఓ పత్రికకి ప్రతివారపు అంశాన్ని రాసింది.

నఫీసా మరణం :

నఫీసా కెరీర్ సక్సెస్ ఫుల్ గానే సాగింది కానీ.. ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ఆందోళనలతో కొనసాగింది. మరికొన్ని వారాల్లో వ్యాపారవేత్త గౌతమ్ ఖండుజాని పెళ్లి చేసుకోవాల్సిన సమయంలో ఈమె 2004 జూలై 29వ తేదీన ముంబైలోని తన ఫ్లాట్ లో ఉరేసుకుని చనిపోయింది. ఈమె బలవన్మరణం చేసుకోవడానికి కారణం ఏమిటంటే.. ఖండుజా రెండేళ్ల క్రితమే తన భార్యకి విడాకులు ఇచ్చానని పేర్కొన్నాడు. కానీ ఇంకా అదే సంబంధంలో అతడు కొనసాగడాన్ని జోసెఫ్ కనుగొంది. దీంతో వారిరువురి వాదనలు జరిగాయి. వైవాహిక జీవితానికి సంబంధించి విషయాలు చెప్పేందుకు అతగాడు నిరాకరించాడు. దీంతో లాభం లేదని భావించి, జోసెఫ్ ఆత్మహత్య చేసుకుంది. ఈమె చనిపోయిన సంవత్సరం తర్వాత  C.A.T.S.లో ఆమె స్నేహితురాలు, సహనటి, మోడల్ కుల్జిత్ రంధావా కూడా ఆత్మహత్య చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nafisa Joseph  Kuljit Randhawa  Indian Models  

Other Articles