Woman sarpanch raped by two men

woman sarpanch raped by two men, Rape victim, Dalit woman sarpanch,

woman sarpanch raped by two men

ఏకగ్రీవ మహిళ సర్పంచ్‌పై అత్యాచారం..

Posted: 07/16/2013 08:31 AM IST
Woman sarpanch raped by two men

పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల అరాచకానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఏకగ్రీవంగా సర్పంచ్ పదవి పొందిన ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడగా, చిత్తూరు జిల్లాలో ఓ వార్డు అభ్యర్థిని అధికార పార్టీ నాయకులు రాత్రి కిడ్నాప్ చేసి చితకబాదారు. సైదాపురం మండలం చాగణం రాజుపాళెం సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ పంచాయతీలో ఉన్న ఏకైక ఎస్సీ ఓటరు, వైఎస్సార్సీపీ మద్దతుదారు అయిన మహిళ(58)కు సర్పంచ్ పదవి వరించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నించారు. ఎలాంటి ఒత్తిళ్లకు ఆమె తలొగ్గకపోవడంతో చివరికి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఊహించని ఘటనతో ఆందోళనకు గురైన ఆమె మనుమడు పక్క మైన్‌లోని వాచ్‌మన్‌కు చెప్పేందుకు పరుగులు తీశాడు. అక్కడి వారిని తీసుకొచ్చేలోపే ఆ వ్యక్తులిద్దరూ ఆమెపై అత్యాచారం పాల్పడి పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న గూడూరు రూరల్ సీఐ వేమారెడ్డి, ఎసై ఖాదర్‌బాషా సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. అధికారపార్టీకి చెందిన దుండగులే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles