The Health And Beauty Benefits Of Ghee | Ghee Home Remedies | Ghee Tips | Health Tips

Ghee health beauty benefits home remedies healthy food items

ghee health benefits, ghee remedies, ghee home tips, ghee beauty benefits, ghee health benefits, ghee recipes, ghee making tips, health tips, skincare tips, health care tips, skin remedies

Ghee Health Beauty Benefits Home Remedies Healthy Food Items : The Health And Beauty Benefits Of Ghee. By Using The Remedies Which Make With Ghee Are Best Than Other.

అందానికి, ఆరోగ్యానికి నెయ్యి దివ్యౌషధం

Posted: 09/08/2015 10:32 AM IST
Ghee health beauty benefits home remedies healthy food items

సాధారణ వంటకాల్లో వినియోగించే నెయ్యి ఆరోగ్యానికి, అందానికి ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో వుండే పోషకాలు వివిధరకాల వ్యాధుల నుంచి పోరాడి ఆరోగ్యంగా వుంచడంతోపాటు చర్మసమస్యల్ని నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇతర ఆరోగ్యకారకాలతో పోల్చితే నెయ్యి దివ్యౌషధంలా పనిచేస్తుంది. అందుకే.. వైద్యులు కూడా తరుచూ ఆహారంలో నెయ్యిని తీసుకోవాల్సిందిగా సలహా ఇస్తారు. ఈ నెయ్యితో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

* కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్‌కి కొన్ని చుక్కలు గోరువెచ్చని నెయ్యి కలిపి, ఆ నూనెను మాడుకు మసాజ్ చేయాలి. తరువాత జుట్టుకు రాసుకోవాలి. పావు గంట తర్వాత తలస్నానం  చేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన జుట్టును మృదువుగా, ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు.
* నిద్ర సరిపోకపోవడం వలన కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. పడుకునే ముందు కళ్ల చుట్టూ ఉండే బాగాన్ని నెయ్యితో మసాజ్ చేసుకోవాలి. పొద్దున్నే లేచిన తరువాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు చాలా త్వరగా పోతాయి.
* పొడిబారిన చర్మం ఉన్న వాళ్లకి నెయ్యి మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. స్నానం చేయడానికి నెయ్యితో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవలసిన అవసరం ఉండదు.
* కొంచెం నెయ్యిని గోరువెచ్చగా వేడి చేసి, చిట్లిన జుట్టుకు రాసుకోవాలి. ఓ గంటసేపు అలాగే వున్న తరువాత కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల్లో పగుళ్లు పోయి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.
* కళ్లకు వేసుకున్న మేకప్‌ని చాలా జాగ్రత్తగా తీసివేయాలి. అందుకు నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా దూది తీసుకొని నెయ్యిలో ముంచి కళ్ల చుట్టూ ఉండే చర్మాన్ని తుడవాలి.
* ప్రతిరోజూ స్నానానికి ముందు రెండు చుక్కల నెయ్యితో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముఖం ఫేషియల్ చేసుకున్నట్టుగా మెరిసిపోతుంది.
* కొంచెం శెనగ పిండిలో కొన్ని చుక్కలు నెయ్యి, పాలు పోసి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి.
* పెదవులు బాగా పొడిబారినప్పుడు పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల అవి చాలా మృదువుగా తయారవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ghee benefits  health tips  beauty tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more