The Best Home Remedies To Get Rid Of Itchy Skin | Health Tips | Skincare Tips | Homemade Tips

Best home remedies to get rid of itchy skin health tips skincare tips

itchy skin tips, skincare tips, itchy skin remedies, itchy skin home remedies, health tips, skin health tips, skin beauty remedies, itchy skin health, skincare remedies, skin home tips, health tips, healthy foods, best remedies

Best Home Remedies To Get Rid Of Itchy Skin Health Tips Skincare Tips : The Best Home Remedies To Get Rid Of Itchy Skin.

చర్మం దురదను నివారించే ఇంటి చిట్కాలు

Posted: 08/14/2015 04:28 PM IST
Best home remedies to get rid of itchy skin health tips skincare tips

స్కిన్ ఎలర్జీ (చర్మం దురద).. ఈ సమస్య ప్రతిఒక్కరినీ చికాకు పెట్టిస్తుంది. ఇది ఒక్కసారి వస్తే చాలు.. ఒళ్లంతా మంటగా, దురదగా వుంటుంది. ఈ దురద పెట్టడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే.. అలర్జీ, ఇతర స్కిన్ డిసీజ్ లు, డ్రై స్కిన్, హెచ్ఐవిఎస్, శరీరంలో పేలు, తామర, తట్టు, చర్మంపై ఫంగల్, ఇన్ఫెక్షన్, డ్రైపర్ రాషెష్, ఎరువుల పాయిజనింగ్, ఫుడ్ అలర్జీ, డ్రగ్ అలర్జీ, కీటకాలు కాటు మొదలైనవి.

ఈ సమస్య వచ్చినప్పుడు సహజంగా అందరూ గోకటం లేద స్ర్కబ్ చేస్తారు. అలా చేస్తే.. సున్నితమైన చర్మం గాయపడటమే కాకుండా అందవిహీనంగా తయారవుతారు. ఒళ్లంతా చాలా మంటగా అనిపిస్తుంది. అంతేకాదు.. గోకడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి.. ఈ సమస్య వచ్చినప్పుడు గోకడం మానేసి.. ఇంటి చిట్కాలను పట్టిస్తే చాలు. తక్షణమే ఉపశమనం పొందవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...

* తులసి : ఈ ఆకుల్లో ఔషధగుణాలు ఎక్కువ మోతాదులో పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా దురద నుంచి ఉపశమనం కలిగించే కార్పూరం, థైమోల్ వంటివి వుంటాయి. అలాగే ఇంకా ఇందులో వుండే యాంటీసెప్టిక్ లక్షణాలు చర్మంలోని ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు దాగివున్న ఈ తులసిని పేస్టులా తయారుచేసుకుని.. చర్మం దురదగా వున్న ప్రదేశంలో అప్లై చేయాలి. వెంటనే ఫలితం తెలుస్తుంది.

* పుదీనా : ఇందులో యాంటి సెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే రెమెడీల్లో చాలా మంచి రెమెడీగా గుర్తింపు పొందింది. అలాగే.. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వాటి ద్వారా వచ్చే దురదను కూడా అరికడుతుంది. ఇంకా వాపు, చికాకును తగ్గిస్తుంది. పుదీనా రసాన్ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే.. దురద తగ్గి, చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది.

* వేపాకు : చర్మం దురద నివారణకు ఇది బెస్ట్ రెమెడీ. ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేస్తుంది. అంతే కాదు.. దురద, చికాకు, ఇన్ఫ్లమేషన్ లను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఇది చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేపనూనెను దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే.. తక్షణం ఉపశమనం పొందవచ్చు.

* నిమ్మరసం : నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ పుష్కలంగా వుంటాయి. అవి ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్, చర్మం మీద దద్దుర్లును నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే దురద వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ నివారించడంలో నిమ్మ సహాయపడుతుంది. చర్మ దురదగా ఉన్న ప్రదేశంలో నిమ్మరసం అప్లై చేయాలి.

* కొబ్బరి నూనె : చర్మం దురదగా వున్న ప్రదేశంలో గోరువెచ్చగా వున్న కొబ్బరినూనెను అప్లై చేసి.. సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది చర్మానికి మాయిశ్చరైజ్ గా పనిచేసి.. దురదను నివారిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : itchy skin remedies  health tips  skincare tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more