సాధారణంగా వైద్యులు మన శరీరంలో వున్న కొలెస్టిరాల్ మోతాదుని బట్టి.. ఆరోగ్యంగా వున్నామా? లేదా? అనేది బేరీజు వేసుకుని చెబుతారు. అంటే.. శరీరంలో కొలెస్టిరాల్ ఎక్కువ అయితే అనారోగ్యానికి గురవుతాం... అదే సరైన మోతాదులో కొలెస్టిరాల్ వుంటే వివిధ రకాలుగా అది శరీరంలో ఉపయోగించబడుతుంది. జీవక్రియలు కూడా సహజంగానే పనిచేస్తాయి.
ముఖ్యంగా బరువు ఎక్కువగా వున్నవారిలోనే ఈ కొలెస్టిరాల్ శాతం అధికంగా వుంటుంది. ఇది కనుక ఎక్కువగా వుంటే.. శరీరంలో జరిగే రక్తప్రసరణ ఆగిపోయే ప్రమాదముంటుంది. అధికంగా గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొలెస్టిరాల్ ఆయిల్ రూపంలో వుంటుంది. ఇది రక్తంలో కలిస్తే.. శరీరంలో రక్తప్రసరణ జరగడం చాలా కష్టమవుతుంది.
ఇటువంటి కొలెస్టిరాల్ శరీరంలో అధికంగా వున్నప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా సులభంగా గ్రీన్ వెజిటేబుల్స్ తో తగ్గించుకోవచ్చు. ప్రస్తుతకాలంలో జరిపిన కొన్ని పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ స్టేట్ మెంట్ ని వెల్లడించారు కూడా. అంతేకాదు.. గ్రీన్ వెజిటేబుల్స్ లో వుండే రసాయనాలు, ఐరన్, పోషక పదార్థాలు నిత్యం ఆరోగ్యంగా వుండేందుకు చాలా సహాయపడుతాయి.
కొలెస్టిరాల్ ను తగ్గించే నేచురల్ గ్రీన్ వెజిటేబుల్స్ :
1. కీరదోసకాయ... ఇది ఒక ఉత్తమమైన గ్రీన్ వెజిటేబుల్. దీనిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో వుండే వేడిని బయటకు పంపివేసి.. చల్లగా వుండేందుకు సహాయపడుతుంది. అలాగే శరీరంలో అనవసరంగా కూరుకుపోయిన కొలెస్టిరాల్ ను తగ్గించడంలో ప్రముఖపాత్రను వహిస్తుంది.
2. బెండకాయ... బెండకాయలో అధిక మోతాదులో ఫైబర్ వుంటుంది. ఇది మన శరీరంలో వుండే వేస్ట్ కొలెస్టిరాల్ ను తగ్గించి.. ఫిట్ గా వుండేందుకు సహాయపడుతుంది. అలాగే హార్డ్ డిసీజ్ రిస్క్ లను కూడా తగ్గిస్తుంది.
3. అస్పరాగస్... దీనిని నిత్యం ఆహారంలో తీసుకోవడం ద్వారా.. ఇందులో వుండే పోషకాలు కొలెస్టిరాల్ లెవల్ ను తగ్గించడంలో సహాయపడుతాయి.
4. మష్రుమ్... ఇందులో ఎరిటేడినైన్, లెటినిన్ అనే పోషకపదార్థాలు శరీరంలో వున్న కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతాయి. అంతేకాదు... ఈ రెండు పోషకాలలోని లెటినిన్ అనే పోషకం క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
5. రెడ్ బెల్ పెప్పర్... ఇందులో అధిక మోతాదులో వుండే విటమిన్ సి.. శరీరంలో వుండే కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా విటమిన్ సి ఎక్కువగా వుండే పదార్థాలను నిత్యం డైట్ (ఆహారం)లో తీసుకుంటే.. కొలెస్టిరాల్ శాతం చాలావరకు తగ్గుతుంది.
6. కొల్లార్డ్ గ్రీన్... దీనిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఆహారంలో తీసుకుంటే కొలెస్టిరాల్ శాతం చాలావరకు తగ్గిపోయి.. హెల్తీ లైఫ్ ను పొందుతారు. ఇది అన్నిటికంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
7. ఉల్లిపాయలు... వీటిని పచ్చివి లేదా ఉడికించినవి తీసుకుంటే.. శరీరంలో అనేక ప్రోటీన్లు అందిస్తాయి. ఇవి శరీరంలో పెరిగే కొలిస్టిరాల్ తో పోరాడి.. దానిని తగ్గించేందుకు సహాయపడుతుంది.
8. క్యారెట్స్... ఇందులో బీటా కెరోటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా వుంటుంది. ఇది శరీరంలో వుండే కొలెస్టిరాల్ ను తగ్గించి.. శరీరానికి అవసరమయ్యే కొవ్వు పదార్థాలను సరైన మోతాదులో వుంచుతుంది. వెజిటేబుల్స్ లో క్యారెట్ అన్నిటికంటే శ్రేష్టమైనది కూడా.
9. వంకాయలు... ఇందులో వుండే సోలబుల్ ఫైబర్.. శరీరంలో వుండే కొలెస్టిరాల్ శాతాన్ని తగ్గించడానికి చాలా సమాయపడుతాయి.
10. టమోటో... ఇందులో వుండే లైకోపిన్ పోషకం.. కొలెస్టిరాల్ ను శరీరంలో వ్యాపించకుండా చేస్తుంది. టమోటోను వండినప్పుడు ఈ లైకోపిన్ శాతం మరింత పెరుగుతుంది.
11. కాలీఫ్లవర్... కాలీఫ్లవర్ కొలెస్టిరాల్ ను తగ్గించడంలో ప్రముఖపాత్రను వహిస్తుంది. ఎందుకంటే.. ఇందులో వుండే స్టెరోల్స్.. కొలెస్టిరాల్ స్థాయిని తగ్గించి.. శరీరానికి అవసరమయ్యే కొవ్వును వుంచుతుంది.
12. ఆకుకూరలు (గ్రీన్ లీఫ్స్)... వీటిలో వుండే ల్యూటిన్.. శరీరంలో వుండే అధిక కొవ్వును తగ్గించి.. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే, నిత్యం ఆరోగ్యంగా వుండొచ్చు.
13. వెల్లుల్లి (గార్లిక్)... ఇందులో యాక్టివ్ సబ్ స్టాన్ గా పిలువబడే అల్లిసిన్ అనే కంటెంట్... శరీరంలో వుండే కొవ్వును తగ్గించి.. నేచురల్ గా వుంచుతుంది. అంతేకాదు.. ఏడిఎల్ లెవల్స్ ను తగ్గించి, బ్యాడ్ కొలెస్టిరాల్ ను తొలగిస్తుంది. పైగా శరీరానికి అవసరమయ్యే మంచి కొలెస్టిరాల్ ను ఇది అందిస్తుంది.
14. బీన్స్... ఇవి జీర్ణక్రియను వేగవంతం చేయడానికి చాలా దోహదపడుతాయి. వీటిలో వుండే హై ఫైబర్స్ కొలెస్టిరాల్, బరువును తగ్గించి, ఆరోగ్యంగా వుండేందుకు సహాయపడుతాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more