Sports Ministry announces awards for 2017 క్రీడాకారులకు పురస్కారాలను ప్రకటించిన కేంద్రం

Sports ministry announces khel ratna dronacharya arjuna and dhyan chand awards

sardar singh, Devendra Jhajharia, Cheteshwar Pujara, Harmanpreet kaur, sports ministry, rajiv khel ratna, sports news, cricket, news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

The Sports Ministry, decided to award the Rajiv Gandhi Khel Ratna 2017 to Para-Athlete Devendra Jhajharia and former India hockey captain Sardar Singh. The Dronacharya and Dhyan Chand awards were also handed out.

క్రీడాకారులకు పురస్కారాలను ప్రకటించిన కేంద్రం

Posted: 08/22/2017 04:23 PM IST
Sports ministry announces khel ratna dronacharya arjuna and dhyan chand awards

తాము ఎంచుకున్న క్రీడలో విజేతలుగా నిలిచి.. దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చినా.. ఇన్నాళ్లు పార అథ్లెట్ లకు దక్కిన గౌరవం ఈ సారి దక్కింది. ఇకపై కూడా దక్కనుంది. పారా అథ్లెటెక్ లకు ఇకపై క్రీడాకారులకు దక్కే అత్యున్నత పురస్కారాలు కూడా లభించనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత తొలిసారగి క్రీడాకారుల అత్యున్నత పురస్కారం అందుకుంటున్న వారిలో పారా అథ్లెట్‌ దేవేంద్ర జఝరియాతో పాటు జావెలిన్‌ త్రోయర్‌ దేవేంద్ర జఝరియాలకు భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ దక్కింది.

రియో పారా ఒలింపిక్స్ లో  రెండు స్వర్ణాలు గెలుపొంది సత్తా చాటిన జఝరియాల ఖేల్ రత్న అవార్డుల సిఫారుసులో ప్రాధాన్యత దక్కించుకున్నాడు. 25  ఏళ్ల చరిత్ర ఉన్న రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ఓ పారాలింపియన్‌ అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరొవైపు దశాబ్ద కాలానికి పైగా భారత హాకీకి సేవలందిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్‌ సింగ్‌ కూడా రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు దక్కింది. ఈ మేరకు 2017 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం క్రీడా పురస్కారాలు ప్రకటించింది. ఈనెల 29న రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ క్రీడాకారులకు అవార్డును ప్రధానం చేయనున్నారు.

ద్రోణాచార్య అవార్డులు – 7

దివంగత ఆర్.గాంధీ – అథ్లెటిక్స్
హీరా నంద్ కటారియా – కబడ్డీ
జీఎస్ఎస్వీ ప్రసాద్ – బ్యాడ్మింటన్
బ్రిజ్ భూషణ్ మొహంతి – బాక్సింగ్
పీఏ రాఫెల్ – హకీ
సంజయ్ చక్రవర్తి – షూటింగ్
రోషన్ లాల్ – రెజ్లింగ్

అర్జున అవార్డులు: 17

వీజే సురేఖ ఆర్చరీ
ఖుష్బీర్ కౌర్    –  అథ్లెటిక్స్
అరోకియా రాజీవ్  – అథ్లెటిక్స్
ప్రశాంతి సింగ్        –  బాస్కెట్ బాల్
లైశ్రమ్ దేవేంద్రో సింగ్  – బాక్సింగ్
చటేశ్వర్ పుజారా  – క్రికెటర్
హర్మన్ ప్రీత్ సింగ్ –  క్రికెట్
ఓయినమ్ బెంబెం దేవి – ఫుట్ బాల్
ఎస్ఎస్పీ చౌరాసియా – గోల్ఫ్
ఎస్వీ సునీల్ – హాకీ
జస్వీర్ సింగ్  – కబడ్డీ
పీఎన్ ప్రకాశ్ – షూటింగ్
అమల్ రాజ్ – టేబుల్ టెన్నీస్
సాకేత్ మైనేని  – టెన్నీస్
సత్యవ్రత్ కడియన్ – రెజ్లింగ్
మరియప్పన్ – పారా అథ్లెట్
వరుణ్ సింగ్ బాటి – పారా అథ్లెట్

ధ్యాన్ చంద్ అవార్డులు – 3

భూపేందర్ సింగ్ – అథ్లెటిక్స్
సయ్యద్ షాహిద్ హకీం – ఫుట్ బాల్
సుమరాయ్ తెతె – హాకీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles