Alastair Cook scores century in farewell Test తుది టెస్టులో శతకంతో అలెస్టర్ కుక్ వీడ్కోలు..

England v india alastair cook hits century in final test innings

India vs England, Alastair Cook, Alastair Cook century, Alastair Cook record, Alastair Cook retirement, Indian cricket team, Mohammed Azharuddin, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Alastair Cook broke a number of records in the final innings of his Test career as he scored a brilliant century on Day 4 of the fifth Test match against India at the Oval

తుది టెస్టులో శతకంతో అలెస్టర్ కుక్ వీడ్కోలు..

Posted: 09/10/2018 07:01 PM IST
England v india alastair cook hits century in final test innings

టీమిండియాతో జరుగుతోన్న చివరి టెస్టు.. తన అఖరి టెస్టు కావడంతో తనదైన శైలిలో ట్రేడ్ మార్క్ శతకంతో ఇంగ్లాండ్‌ ఆటగాడు కుక్‌ శతకం విడ్కోలు పలికాడు. 70వ ఓవర్లో విహారి వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న కుక్‌ ఆ బంతికి బౌండరీకి తరలించాడు. దీంతో కుక్ తన టెస్టు కెరీర్ లో 33వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఆఖరి టెస్టులో శతకం సాధించడంతో కుక్‌ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. కుక్‌ సెంచరీ చేయగానే గ్యాలరీ నుంచి అతని కుటుంబసభ్యులతో పాటు అభిమానుల చప్పట్లతో స్టేడియం హోరెత్తింది.

ఈ సమయంలో కుక్‌ భావోద్వేగానికి గురయ్యాడు. బ్యాట్ ను గాల్లోకి లేపి కుక్‌ సంబరాలు చేసుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్ తో పాటు చివరి టెస్టులోనూ ప్రతి ఇన్నింగ్స్ లోనూ 50కి పైగా పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా కుక్‌ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు 69 ఏళ్ల రికార్డును అందుకున్నాడు. 114/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాలుగోరోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థి జట్టును మన బౌలర్లు వీలైనంత త్వరగా ఆలౌట్‌ చేద్దామనుకుంటే ఇంగ్లాండ్‌ బ్యాట్స్ మెన్లు కుక్‌-రూట్ క్రీజులో పాతుకుపోయారు.

వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ, వికెట్ల మధ్య పరుగులు చేస్తూ వీరిద్దరూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్నారు. మరో పక్క ఈ జోడీని విడదీయలేక కోహ్లీ సేన నానా తంటాలు పడుతోంది. 71 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 232పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కుక్‌ (101), రూట్‌ (83) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 272 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  Alastair Cook  century  retirement  team India  Mohammed Azharuddin  sports  cricket  

Other Articles