KL Rahul, Rishabh Pant heroics in vain as England win రాహుల్-పంత్ ల జోడీపై ప్రశంసల వెల్లువ

Kl rahul rishabh pant heroics in vain as england win

India, England, India tour of England 2018, India vs England, virat kohli, virat kohli on test defeat, virat after losing last test, virat kohli, rishabh panth, kl rahul, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

KL Rahul ((149 off 224 balls) and Rishabh Pant's (114 off 146 balls) heroic resistance went in vain as sensational centuries from both the batsmen almost made it certain that India would go to salvage some lost pride and register an improbable win.

రాహుల్-పంత్ ల జోడీపై ప్రశంసల వెల్లువ

Posted: 09/12/2018 08:28 PM IST
Kl rahul rishabh pant heroics in vain as england win

ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అఖరిది, ఐదవదైన టెస్టు ముగిసినా అందులో విజయం సాధించడానికి టీమిండియా తరపున తుదివరకు పోరాటం చేసిన కేఎల్ రాహుల్- రిషబ్ పంత్ ల పోరాట పటిమపై ప్రశంసలు జల్లు కురుస్తుంది. ఈ జోడి చివరి టెస్టులో కనబర్చిన పోరాట స్పూర్తిపై టీమిండియా మాజీ దిగ్గజాలు తమదైన శైలిలో స్పందించారు.

క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సేహ్వాగ్ లు వీరి జోడి అద్భుతంగా అడిందని, ఒకదశలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు మ్యాచ్ దూరమైందన్న భయాన్ని కూడా నెలకొల్పిందని అభిప్రాయపడ్డారు. అయితే చివరి దశలో పట్టు తప్పిన టీమిండియా ఓటమిని చవిచూడక తప్పలేదు.

ఇదిలావుండగా, రిషబ్ పంత్ మరో రెండు అరుదైన ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో శతకం చేసిన మొదటి భారత వికెట్‌ కీపర్‌ పంత్‌. ప్రపంచంలో ఏడోవాడు కావడం విశేషం. ఇక దీంతో పాటు సిక్సర్‌తో సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్ మెన్‌ పంత్‌. ఇంతకుముందు కపిల్ దేవ్‌, హర్భజన్ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ ఘనత సాధించారు. టెస్టుల్లో పంత్ సిక్సర్ తోనే తొలి పరుగులు సాధించడం కూడా అరుదైన విశేషమే.

‘దూకుడుకు సరికొత్త నిర్వచనం చెబుతూ కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ గొప్పగా బ్యాటింగ్‌ చేశారు. వీళ్లిద్దరి భాగస్వామ్యం ఈ సిరీస్‌లో చెప్పుకోదగ్గ విషయాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ - సచిన్‌ తెందుల్కర్‌

‘‘ఆఖరి వరకు పోరాటాన్ని విడవకూడదన్న కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ల తత్వాన్ని ఇష్టపడుతున్నా. వారిద్దరు చిరస్మరణీయ సెంచరీలు సాధించారు’’ - వీవీఎస్‌ లక్ష్మణ్‌

‘‘టెస్టు క్రికెట్లో పరుగుల ఖాతాను సిక్సర్‌తో ఆరంభించాడు. తొలి సెంచరీని సిక్స్‌తో అందుకున్నాడు. నీ ఆటతో ఆకట్టుకున్నావ్‌ రిషబ్‌ పంత్‌. కేఎల్‌ రాహుల్‌ కూడా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. కఠినమైన సిరీస్‌లో కొత్త వెలుగులు కనిపిస్తున్నాయి’’ - వీరేంద్ర సెహ్వాగ్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  England  India tour of England 2018  India vs England  virat kohli  sports  cricket  

Other Articles