సందర్భమో.. అసందర్భమో.. లేక మరేదైనా కారణముందో తెలియదు కానీ.. ఏకంగా తాను వాడుతున్న బ్యాట్ పై ఒక చక్కని సందేశంతో పాటు తన అటోగ్రాఫ్ చేసి టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. అలనాటి మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మనవరాలికి కానుకగా పంపారు. ఈ విషయాన్ని పటౌడీ కుమార్తె, బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ బ్యాట్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. బ్యాట్‌పై మిథాలీ ‘వయసు హద్దు కాదు..’ అని సందేశాన్ని రాసి తన ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
ఈ బ్యాట్ ఫొటోను సోహా ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. తన అభిప్రాయాలను పంచుకుంది సోహా. అమె ఏం రాసిదంటే.. ‘ఇంతటి అపురూపమైన కానుకను నా కూతురు ఇనాయాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మిథాలీ. ఇనాయా త్వరగా ఎదిగి క్రికెట్ రంగంలోకి రావాలని ఎంతగానో ఎదురుచూస్తున్నా. అప్పటివరకు నువ్వు బాగా ఆడి భారత్ ను గర్వపడేలా చేయడం చూస్తుంటాం’ అని ట్వీట్ చేశారు. దీనికి మిథాలీ ప్రతిస్పందిస్తూ.. ‘ధన్యవాదాలు. ఇనాయా రక్తంలోనే క్రికెట్ ఉంది’ అని ట్వీట్ చేశారు.
అయితే ఏ సందర్భంలో మిథాలీ ఈ బ్యాట్‌ను ఇనాయాకు పంపారు అన్న విషయం మాత్రం తెలియరాలేదు. మన్సూర్ అలీ ఖాన్ 21ఏళ్ల వయసులో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్లలో ఆయన ఒకరు. మన్సూర్ కుమారుడు సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కుమార్తె సోహా అలీ ఖాన్ కూడా పలు చిత్రాల్లో నటించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more