Ramesh Powar named interim coach రమేష్ పవార్.. టీమిండియా తాత్కాలిక కోచ్

Ramesh powar named interim coach of indian women s cricket team

Coach, INterim coach, Ramesh Powar, Indian womens cricket team, BCCI, Tushar Arothe,, cricket, cricket news, sports news, latest sports news, sports

Former Indian cricketer Ramesh Powar was on Monday appointed the interim coach of national women's cricket team. Pawar will replace Tushar Arothe, who was forced to resign in the wake of differences with senior players

రమేష్ పవార్.. టీమిండియా తాత్కాలిక కోచ్

Posted: 07/16/2018 05:01 PM IST
Ramesh powar named interim coach of indian women s cricket team

టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ రమేశ్ పవార్ కు భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ బాధ్యతలను తాత్కాలిక ప్రాతిపదికన అందజేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరి రవిశాస్త్రీకి ఏం చేస్తాడు.. ఆయన లీవ్ లో వెళ్తున్నారా..? అన్న సందేహాలు మీ మదిని తొలుస్తున్నాయా.. అంతలా అలోచించకండీ.. ఎందుకంటే రమేష్ పవార్ విరాట్ సేను తాత్కలిక కోచ్ గా రావడం లేదు. పవార్ మిధాలీసేనకు.. అంటే భారత మహిళల క్రికెట్‌ జట్టుకు.

కొద్ది రోజుల క్రితం భారత్‌ మహిళల జట్టు కోచ్‌ తుషార్‌ ఆరోథ్ ఈ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీనియర్‌ క్రీడాకారిణులు కోచ్‌ పద్ధతి సరిగా లేదంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో తుషార్‌ రాజీనామా చేశారు. దీంతో మహిళల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా మాజీ క్రికెటర్‌ రమేశ్‌ పవార్‌ను ఎంచుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జులై 25 నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో మిథాలీ సేన శిక్షణ తీసుకోనుంది. అప్పటి నుంచే రమేశ్‌ జట్టుతో కలవనున్నాడు. ‘బీసీసీఐ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు నాకు అప్పగించింది. ఎంతో సంతోషంగా ఉంది. భారత జట్టు మంచి విజయాలు సాధించేలా కృషి చేస్తా’ అని పవార్‌ తెలిపారు.

‘వచ్చే నెలలో భారత మహిళల జట్టుకు పూర్తి స్థాయి కోచ్‌ను ఎంపిక చేస్తాం. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేశాం. జాతీయ జట్టు లేదా రాష్ట్రానికి చెందిన ఫస్ట్‌ క్లాస్‌ జట్టుకు కోచింగ్‌ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న 55 సంవత్సరాలలోపువారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చిన బీసీసీఐ తెలిపింది. ఈ నెల 20లోగా దరఖాస్తులు పంపాలని సూచించింది. రమేశ్‌ పవార్‌ భారత్‌ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coach  INterim coach  Ramesh Powar  Indian womens cricket team  BCCI  Tushar Arothe  cricket  

Other Articles