Hang me if I am found guilty: Mohammed Shami పెళ్లైన విషయం దాచి.. నన్ను పెళ్లాడింది: షమి

Mohammed shami makes a big statement on patch up with wife

mohammed shami, hasin jahan, Maharashtra, Mumbai, IT Raids, domestic voilence, cricket, cricket news, sports news, latest sports news, sports

Out-of-contract Indian cricketer Mohammed Shami has admitted that his hopes of reuniting with wife Hasin Jahan are over as the rift between them continues to get ugly.

ఇక అమెతో కలసి జీవించడం కుదరదు: షమి

Posted: 03/15/2018 07:44 PM IST
Mohammed shami makes a big statement on patch up with wife

టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమి చాలా మంచోడని మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, ధోని సహా ఆయనకు పిల్లనిచ్చిన మామ కూడా మద్దతు పలికిన నేపథ్యంలో, ఆయన భార్య హసీన్‌ జహాన్‌ మాత్రం తన స్వరాన్ని మార్చడం లేదు. ఈ క్రమంలో అమె షమీపై రోజుకో అరోపణ చేస్తూనే వుంది. అవి కాస్తా సంచలనంగా మారుతూనే వున్నాయి. ఈ క్రమంలో ఆయనపై పోలీసు కేసుతో పాటు ఐటీ దాడులు కూడా జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో షమి స్పందించాడు. హసీన్ కు ముందే మరో వ్యక్తితో పెళ్లి అయిన విషయాన్ని దాచి తనను పెళ్లాండిందని తెలిపాడు.

తాను హసీన్ జహాన్ ను పెళ్లి చేసుకునేటప్పటికే ఆమెకు మరొకరితో పెళ్లి అయ్యింది. అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉన్నారు షమీ అరోపించాడు. అయితే ఈ విషయం తన వద్ద దాచి పెళ్లి చేసుకుందని అన్నాడు. పిల్లలు ఎవరన్న అనుమానంతో తాను అమెను అడిగితే.. చనిపోయిన తన సోదరి పిల్లలు అని చెప్పిందని.. అమె మాటలను గుడ్డిగా నమ్మిన తాను అమెను పెళ్లి చేసుకున్నానని అన్నాడు. ఆ తర్వాత కొంత కాలానికి హసీన్‌ అసలు విషయం చెప్పిందని అమెకు షఫీయుద్దీన్ అనే వ్యక్తితో పెళ్లి అయ్యిందని, ఆ పిల్లలు తన పిల్లలే అని చెప్పడంతో తాను షాక్ అయ్యానని షమి తెలిపాడు.

2002లో హసీన్‌.. షఫీయుద్దీన్‌ అనే వ్యక్తిని పెళ్లాడిందని అయితే.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అమెకు తన మొదటి భర్తతో విభేదాలు తలెత్తాయని, దీంతో అతనితో 2010లో విడిపోయి తన తల్లిదండ్రుల వద్దకు చేరిందని అన్నాడు. కాగా, తనకు హసీన్ తో  2012లో పరిచయం ఏర్పడిందని, అది క్రమంగా పరిణయానికి దారి తీసిందని చెప్పాడు. దీంతో 2014లో అమెను పెళ్లి చేసుకున్నానని.. ప్రస్తుతం నాకు ఒక పాప కూడా వుందని చెప్పాడు. పాప భవిష్యత్ విషయంలో ఇన్నాళ్లు అగానని.. అయితే ఇక అమెతో కలసి జీవించడం కుదరదని తేల్చిచెప్పాడు. హసీన్‌ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు షమీపై గృహహింస, అత్యాయత్యం కేసును ఎలా దర్యాప్తు చేస్తారో..? వారి విచారణలో ఏమి తేలుతుందో వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohammed shami  hasin jahan  Maharashtra  Mumbai  domestic voilence  Sports  Cricket  

Other Articles