క్రికెట్ దేవుడిగా ఖ్యాతిగడించిన భారత క్రికెట్ దిగ్గజం, సచిన్ టెండూల్కర్ తన బాల్యమిత్రుడితో వ్యవహరించిన శైలి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీ చేసిన పనిని అడ్డుకున్న సచిన్.. గురించి ఆయన స్వభావం గురించి ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తుంది. వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇద్దరూ స్కూల్ దశలోనే రికార్డులను క్రియేట్ చేసి హైలైట్ అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరికి స్నేహం చిగురించి టీమిండియా జట్టులో వరకు కొనసాగింది.
ఆ తరువాత విరిద్దరి మధ్య పోరపచ్చాలు వచ్చి.. ఇద్దరూ మధ్య స్నేహబంధం దూరమైంది. ఆ తరువాత సచిన్ తాను రిటైరయ్యాక తన మిత్రులందరికీ ఒక్కక్కరిని పిలిచి వారికి డిన్నర్ ఇచ్చారు. ఇలానే వినోద్ కాంబ్లీ కూడా ఆయన పోన్ చేసి మళ్లీ తమ స్నేహబంధాన్ని చిగురింపచేశారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై టీ20 లీగ్ ముగింపు కార్యక్రమం సందర్భంగా అతిధులుగా వచ్చిన సచిన్, గవాస్కర్ విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ఫైనల్ లో ఓటమి పాలైన శివాజీ పార్క్ లయన్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న కాంబ్లీ మెడల్ అందుకోవడానికి వచ్చి, సచిన్ పాదాలను తాకే ప్రయత్నం చేయగా, సచిన్, కాంబ్లీని అడ్డుకుని తన గుండెలకు హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సచిన్ మంచి మనన్సును వ్యక్తిత్వాన్ని నెట్ జనులు అభినందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more