BCCI announces cash reward for Under-19 Team విశ్వవిజేతలపై ప్రశంసలు.. ద్రావిడ్ ఏమన్నాడంటే..

Icc u 19 cwc bcci announces cash reward for under 19 team

india vs australia, ind vs aus, ind vs aus U-19 cwc, U-19 CWC, ICC U-19 CWC 2019, Manjot Kalra, Rahul Dravid, BCCI, Ishan Porel, Anukul Roy, Shiva Singh, Kamlesh Nagarkoti, Jonathan Merlo, Rahul dravid, sachin tendulkar, Team india, Australia, Under-19 World Cup, New Zealand, Cricket

Rahul Dravid hopes India’s ICC Under-19 Cricket World Cup triumph is a stepping stone for great things to come following Saturday’s eight-wicket win over Australia in the final.

విశ్వవిజేతలపై ప్రశంసలు.. ద్రావిడ్ ఏమన్నాడంటే..

Posted: 02/03/2018 06:01 PM IST
Icc u 19 cwc bcci announces cash reward for under 19 team

ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌ లో యువభారత్ విశ్వవిజేతగా అవతరించిన శుభతరుణంలో భారత యువ క్రికెట్ జట్టుకు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్లంగా వున్న క్రికెట్ అభిమానులు కూడా యువ విశ్వవిజేతలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరితో పాటుగా భారత్ క్రికెట్ దిగ్గజాలు కూడా టీమిండియా యువజట్టుపై అభినందనలు తెలుపుతున్నారు.

క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా క్రికెటర్లు సురేష్ రైనా, రోహిత్ శర్మలు కూడా టీమిండియాపై ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అండర్-19 ఆటగాళ్లకు ట్విట్టర్ మాధ్యమంగా శుభాకాంక్షలు చెప్పారు. ఇక నెట్ జనులు సామాజిక మాద్యమాల ద్వారా యువవిశ్వవిజేతలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సచిన్ జట్టును అభినందిస్తూ 'శుభాకాంక్షలు ఛాంపియన్స్, దేశాన్ని గర్వించేలా చేశారని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభినందిస్తూ... రాహుల్, పరస్ కు శుభాకాంక్షలు' అన్నాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర జూనియర్ల ఆటను కొనియాడుతూ, తన ట్విట్టర్ ఖాతా ద్వారా వారి వరల్డ్ కప్ విజయ క్షణాలకు సంబంధించిన ఫోటోను పంచుకున్నారు.

ఇక మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా, వర్ధమాన ఆటగాళ్లు అభినందలు తెలిపారు. టీమిండియా వాల్ గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ అధ్వర్యంలో గెలుపు సాధించినందుకు అభినందిస్తూ.. సురక్షితమైన దిగ్గజం చేతుల్లో యువజట్టు విశ్వవిజేతలుగా నిలిచారని, ఇది భవిష్యత్ క్రికెట్ కు అద్భుతమైన ప్రతిభగల క్రీడాకారులను అందించేందుకు పూర్తిగా దోహదపడుతుందని పేర్కొన్నాడు. ప్రతిభారతీయుడు రాహుల్ ద్రవిడ్ అంకితభావాన్ని కొనియాడుతున్నారని ప్రశంసించాడు.

టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా తన ట్విట్టర్ ఖాతాలో 'అజేయమైన భారత అండర్ 19 ఆటగాళ్లు విజయానికి వందశాతం అర్హులు. ఈ విజయాన్ని ఆస్వాదించండి. కానీ ఇది ఆరంభం మాత్రమేనని గుర్తించండి. జట్టు విజయం వెనుక నిరంతర స్పూర్తిగా నిలిచిన రాహుల్ ద్రవిడ్ కు పెద్ద కేక' అన్నాడు. ఇక ఈ విజయంపై స్పందించిన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ విజయం యువజట్టుకు ఓ మైలురాయి అని అన్నారు.

యువజట్టు అటగాళ్లపై ప్రదర్శన పట్ల తాను గర్వపడుతున్నారని అన్నాడు. సుదీర్ధకాలం నుంచి నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతోకాలంగా వేచి వేచి సాధించారని, ఇది వారికి గుర్తుండిపోతుందని, ఇదు భవిష్యత్తులో మరిన్నీ విజయాలను అస్వాధించడానికి పునాది వేస్తుందని అశాభావం వ్యక్తం చేశాడు. యువజట్లు ఈ ఘనతను సాధించడంలో దోహదపడిన సపోర్టింట్ స్టాప్ అందరికీ కూడా ఆయన అభినందనలు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : U-19 CWC 2019  Team india  Australia  Rahul Dravid  BCCI  Under-19 World Cup  New Zealand  Cricket  

Other Articles