BCCI announces cash reward for Under-19 Team యువ విశ్వవిజేతలకు బిసిసిఐ నజరానా..

Icc u 19 cwc bcci announces cash reward for under 19 team

india vs australia, ind vs aus, ind vs aus U-19 cwc, U-19 CWC, ICC U-19 CWC 2019, Manjot Kalra, Rahul Dravid, BCCI, Ishan Porel, Anukul Roy, Shiva Singh, Kamlesh Nagarkoti, Jonathan Merlo, Team india, Australia, Under-19 World Cup, New Zealand, Cricket

BCCI have announced a cash reward for members of the victorious Under-19 side along with coach Rahul Dravid and supporting staff.

యువ విశ్వవిజేతలకు బిసిసిఐ నజరానా..

Posted: 02/03/2018 04:11 PM IST
Icc u 19 cwc bcci announces cash reward for under 19 team

ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌ లో యువభారత్ విశ్వవిజేతగా అవతరించిన శుభతరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) యువభారత జట్టుకు నజరానాను ప్రకటించింది. వరల్డ్ కప్ సాధించి దేశప్రతిష్ఠను నలుదిశలా ఇనుమడింపజేసిన జట్టును ప్రశంసించిన బీసీసీఐ.. నాలుగో పర్యాయం ప్రపంచకప్ ను అందుకోవడంతో భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని అటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, సపోర్టింగ్ స్టాప్ లకు కూడా నజరానా అందనుంది.

జట్టులోని ప్రతీ ఆటగాడికి 30 లక్షల చొప్పున నజరానా ప్రకటించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. జట్టు విశ్వవిజేతగా అవతరించడంలో తన కఠోర శ్రమను, అంకుఠిత దీక్షను పెట్టి విజయతీరాల వైపు నడిపించిన జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు 50 లక్షలు నజరానాను ప్రకటించింది. దీంతో పాటు జట్టు సహాయ సిబ్బందికి 20 లక్షల చొప్పున బహుమతి ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : U-19 CWC 2019  Team india  Australia  Rahul Dravid  BCCI  Under-19 World Cup  New Zealand  Cricket  

Other Articles