Anushka Sharma And Virat Kohli Married విరాట్ కోహ్లీ, అనుష్క జంట ఒక్కటయ్యారోచ్..!

It s official virat kohli and anushka sharma married

Cricket, ODI, India v/s Sri Lanka, Ind vs SL, Zaheer Khan,Virat Kohli, Sharmila Tagore, Mansur Ali Khan Pataudi, Anushka Sharma, sports news,sports, latest sports news, cricket news, cricket

After months of speculations and weeks of making headlines on a daily basis, Indian cricket team captain Virat Kohli tied the knot with Bollywood actress and long time girlfriend Anushka Sharma in Milan, Italy

విరాట్ కోహ్లీ, అనుష్క జంట ఒక్కటయ్యారోచ్..!

Posted: 12/11/2017 08:39 PM IST
It s official virat kohli and anushka sharma married

టీమిండియా కెప్టెన్, పరుగుల మెషీన్ గా పేరొందిన విరాట్ కోహ్లీతో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జంట ఇటలీలో పెళ్లి చేసుకోబుతన్నారన్న వార్తలు పూర్తిగా తప్పు. ఎందుకంటే వారి పెళ్లి చేసేసుకున్నారన్న వార్తలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. పెళ్లి వార్తలను అనుష్క శర్మ మేనేజర్ ఖండించడం.. ఆ తర్వాత అనుష్క విమానాశ్రయంలో కనిపించడం.. అంతా ఏదో అనుమానాలకే దారితీస్తున్నా.. పెళ్లి చేసుకోబోతున్నారనే అందరూ భావించారు.

అయితే ఈ జంటకు ఇదివరకే పెళ్లియిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఓ స్పోర్ట్స్‌ జర్నలిస్టు సోషల్ మీడియాలో పంచుకున్నారు. గురువారం భారత్ ను వీడిన ఈ జంట శనివారమే ఒక్కటయ్యిందని, త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారని పేర్కొన్నారు. అయితే, దీన్ని కూడా ఆ ఇరువురు గానీ, వారి కుటుంబసభ్యులు గానీ ఇప్పటికీ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో ఆరు ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో ఉన్న అతి విలాసవంతమైన విల్లాలో వీరి వివాహం జరగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ నెల 26న ముంబైలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని దానికి కూడా కేవలం కొంతమంది క్రికెట్‌, బాలీవుడ్‌ వర్గాల నుంచి కొందరికి మాత్రమే ఆహ్వానముంటుందని సమాచారం. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, క్రికెటర్లు టెండుల్కర్, యువరాజ్ సింగ్, సహా పలువురు క్రికెటర్లకు, బోర్డు సభ్యులకు అవ్వానాలు అందినట్లు సమాచారం. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిన తరవాత.. ఈ జంట కొంత కాలం మనస్పర్థల కారణంగా దూరమైంది. ఆ తరువాత మళ్లీ ఒక్కటైందని.. ఇక ఈ జంటకు మధ్య మనస్పర్థలకు అవకాశం లేకుండా సాగిపోతుందని పలువురు క్రికెట్, బాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zaheer Khan  Virat Kohli  Sharmila Tagore  Mansur Ali Khan Pataudi  Anushka Sharma  cricket  

Other Articles