a quick 100 metre dash between ms dhoni and hardik pandya ధోని, పాండ్యా మధ్య పరుగు పందెం.. గెలిచిందెవరూ.?

A quick 100 metre dash between ms dhoni and hardik pandya

Cricket, ODI, India v/s Sri Lanka, Ind vs SL, mohali, punjab, Sri Lanka, Team India, Rohit Sharma, double centuries, rohit sharma double centuries, shreyas iyer, shikhar dhawan, MS Dhoni, Hardik Pandya, sports news, sports, latest sports news, cricket news, cricket

Want to know who wins a challenge between former indian captain ms dhoni and young all rounder hardik pandya in a quick 100 metre dash.?

ధోని, పాండ్యా మధ్య పరుగు పందెం.. గెలిచిందెవరూ.?

Posted: 12/13/2017 03:02 PM IST
A quick 100 metre dash between ms dhoni and hardik pandya

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్ గా వున్నాడా..? ఎప్పుడు రిటైర్ అవుతాడు..? అంటూ ఆయన రిటైర్మెంట్ పై అనేక వార్తలు ఈ మధ్యకాలంలో తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ తరహా ప్రశ్నలకు ఆయన ఫూర్తి ఫిట్ గా వున్నానని.. తాను 2019 వరల్డ్ కప్ కూడా అడతానని స్వయంగా ధోనియే విశ్వాసం వ్యక్తం చేసినా.. విమర్శకులు నోళ్లకు మాత్రం తాళం పడటం లేదు. ఈ నేపథ్యంలో బిసిసిఐ ఓ వీడియోను రికార్డు చేసి.. తన ట్విట్టర్ పేజీలో పెట్టింది. ఇక దీనిని చూసిన వాళ్లు మాత్రం ధోనియా మాజకా..? అన్న రేంజ్ లో ప్రశ్నంసలు కురిపిస్తున్నారు.

ధర్మశాల వన్డేలో తానెంటో చేపించినా.. ధోనిపై మాత్రం సీనియర్ల విమర్శలు తెరచాటుగా కొనసాగుతునే వున్నాయి. ఈ క్రమంలో మొహాలీలో ప్రాక్టీసులో భాగంగా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ధోనికి మధ్య పరుగు పందెం పడింది. అయితే ఎవరు నెగ్గుతారు? ఎవరైనా ఠక్కున సమాధానం చెప్పేది పాండ్యా అనే.. అందుకు కారణం.. ధోనికి 36ఏళ్ల వయస్సు వుండగా, పాండ్యాకు కేవలం 24 ఏళ్లు మాత్రమే. దీంతో తేలిగ్గా పరుగెత్తగలిగే సత్తా పాండ్యాకే వుంటుందని భావిస్తారు. దిగ్గజ క్రికెటర్, యంగ్ ప్లేయర్ మధ్య రన్నింగ్ రేసును మన కళ్ల ముందు ఉంచింది.

రెండో వన్డే ప్రారంభానికి ముందు ప్రాక్టీసు సమయంలో పాల్గొన్న ధోనీ, పాండ్య మైదానంలో వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. సరదాగా రన్నింగ్ మొదలుపెట్టిన వీరు.. తర్వాత సీరియస్‌గా తీసుకున్నారు. వీరిద్దరూ చిరుతల్లా పరిగెత్తి.. ఉసేన్ బోల్ట్‌ను మైమరిపించారు. ఇద్దరూ సమానంగా పరిగెత్తినప్పటికీ.. చివర్లో పాండ్య అలసిపోయినట్లు కనిపించాడు. కానీ ధోనీ మాత్రం ఆఖరి వరకూ ఒకే వేగంతో రన్నింగ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన పాండ్యను ఓడించిన ధోనీ.. ఈ వయసులోనూ సత్తా తగ్గలేదని మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  mohali  Sri Lanka  Team India  Rohit Sharma  double centuries  cricket  

Other Articles