Virat Kohli and his troops are gunning for their first ever series whitewash in Sri Lanka when they take on the hosts in the third and the final Test at Pallekele

India vs sri lanka 2017 visitors look to make history in pallekele test

India vs Sri Lanka, virat kohli, Team India, Sri Lanka, pallekele test, kuldeep yadav, ravindra jadeja, ravichandran ashwin, sports news, cricket, news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Virat Kohli and his troops are gunning for their first ever series whitewash in Sri Lanka when they take on the hosts in the third and the final Test at Pallekele

కొత్త చరిత్ర సృష్టించేందుకు సన్నధమవుతున్న విరాట్ సేన

Posted: 08/11/2017 07:58 PM IST
India vs sri lanka 2017 visitors look to make history in pallekele test

పల్లెకెలె వేదికగా జరగనున్న చివరి, మూడో టెస్టులో విజయం సాధించి.. చరిత్రను తిరగరాయాలిన విరాట్ సేన భావిస్తుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. మూడో టెస్టులోనూ గెలిచి సరికొత్త రికార్డును సోంతం చేసుకోవాలని కృతనిశ్చయంతో వుంది. మూడు టెస్టుల సిరీస్ ను వైట్ వాష్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. పరాయి గడ్డపై అతిధ్య జట్టును క్లీన్ స్వీప్ చేసిన తొలి టీమిండియా జట్టుగా నిలవాలని పథక రచన చేస్తుంది.

భారత జట్టు తన 85 ఏళ్ల టెస్టు ప్రయాణంలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు లేవు. ఆ రికార్డును విరాట్ సేన తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆ ఘనతను సాధించేందుకు భారత జట్టు కసరత్తులు చేస్తోంది. పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్ లో ఈ ఘనతను సాధించి.. విమర్శకులకు తమ విజయంతో సమాధానం చెప్పాలని ఉవ్విళ్లూరుతుంది.

ఇప్పటికే మహా దిగ్గజాలున్న టీమిండియా క్రికెట్ జట్టు సాధించని విజయాలను విరాట్ సేన సాధించిందని కోచ్ రవిశాస్త్రీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా తనదైన శైలిలో చురకలంటించారు. రవిశాస్త్రీ పలు టెస్టు మ్యాచ్ లను చూడనట్లుంది అని వ్యంగంగా వ్యాఖ్యానించాడు. అంతటితో అగకుండా వరల్డ్ కప్ వరకు జట్టును విజయాల వైపు నడిపించి.. మరో మారు భారత్ కు ప్రపంచ కప్ ను అందించేలా వారిని అన్ని విభాగాల్లో సిద్దం చేయాలని బదులిచ్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  virat kohli  Team India  Sri Lanka  pallekele test  sports news  cricket  

Other Articles