Pakistan cricketer Umar Akmal gets trolled on Twitter భవిష్యత్తులో క్యాబ్ డ్రైవర్ గా సెటిల్ అవుతాడా..?

Umar akmal gets trolled by fans after posting picture with a bentley

Umar Kamal, Pakistan cricketer, Pakistan cricket, Umar Akmal gets trolled, Bentley, Akmal gets trolled, Pakistan cricketer Umar Akmal, yellow jacket, Bentley car, cricket news, sports news, latest news

Pakistan cricketer Umar Akmal gets trolled on Twitter, who was at the receiving end of his fans despite a beautiful looking image he posted on Twitter.

భవిష్యత్తులో క్యాబ్ డ్రైవర్ గా సెటిల్ అవుతాడా..?

Posted: 07/17/2017 04:47 PM IST
Umar akmal gets trolled by fans after posting picture with a bentley

టీమిండియా క్రికెట్ లో ధోనికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఇటీవలే ఆ దేశ వెటరన్ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర విమర్శల పాలైన సందర్భాలను మర్చిపోకముందే.. అదేశ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌ స్వదేశానికి చెందిన నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఫిట్ గా లేకపోవడం.. ఆటలో అంతగా రాణించలేకపోవడంతో జాతీయ జట్టుకు దూరంగా వున్న ఆయనను నెట్ జనులు సామాజిక మాద్యమం ద్వారా అటాడుకుంటున్నారు. అయితే నెట్ జనుల నుంచి విమర్శలు ఎదుర్కొనేందుకు కారణం మాత్రం ఆయన స్వయంగా తన ట్విటర్ అకౌంట్లో పెట్టిన ఓ ఫొటో.

ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకునే క్రమంలో ప్రస్తుతం ఇంగ్లాండ్ లో శిక్షణ పొందుతున్న అక్మల్.. ఇక తన శిక్షణను ముగించుకుంటున్న క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. తాను కఠోరమైన క్రికెట్ శిక్షణను ముగించుకుంటున్నానని, అయితే ఈ సందర్భంగా తాను తాజాగా కొన్న కారులో ప్రయాణం చేయడం ఎంతో హాయిగా, అనందంగా వుందని చెప్పాడు. దాంతో పాటు బెంట్లీ కారుతో దిగిన దిగిన ఫొటోని తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

అంలే అతనిపై అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. భవిష్యత్తులో కాస్ట్టీ క్యాబ్ డ్రైవర్ గా స్థిరపడేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్దం చేసుకుంటున్నాడని కొందరు ట్విట్ చేయగా, అక్మల్ కు తప్ప అందరు క్రీడాకారులకు తమ ఉత్తమ ప్రదర్శనతో కార్లు గిప్ట్ రూపంలో వస్తుంటే.. రగిలిపోయి కారును కొన్నాడని మరికోందరు, అక్మల్ నువ్వు నిజంగా కష్టపడుతున్నావా..? అంటూ ఇంకోందరూ తీవ్ర విమర్శలు చేశారు.

ఇక కొందరు అభిమానులైతే.. ‘బెంట్లీ కారు కొనేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇది నీ కారు కాదు. ఇతరుల కారు వద్ద నిల్చుని ఫొటో దిగావు’, ప్రస్తుత జట్టులో నువ్వు లేవు’, ‘క్రికెట్‌ పై దృష్టి పెట్టి జట్టులో స్థానం సంపాదించు’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అక్మల్‌ ట్విటర్‌ ద్వారా స్పందించాడు. ‘నా అభిమానులందర్నీ ప్రేమిస్తున్నాను. మీ అందరికీ ఒక విన్నపం. దయచేసి నాపై నెగిటివ్ కామెంట్లు ఆపండి. మీ ప్రార్థనలు, మద్దతు నాకు ఎంతో అవసరం’ అని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles