MS Dhoni to Play for CSK again నాయకుడు పేరుతో ధోని ట్విట్.. వైరల్

Ms dhoni is back to play for chennai super kings again

BCCI, Chennai super kings, CSK, Mahendra singh dhoni, MS Dhoni, N.Srinivasan, Indian premier league, cricket news, sports news, spots, cricket

According to George John, one of the directors of Chennai Super Kings Cricket Limited, the management is already considering to bring Mahendra Singh Dhoni, who had led them with distinction, on board.

నాయకుడు పేరుతో ధోని ట్విట్.. వైరల్

Posted: 07/15/2017 02:22 PM IST
Ms dhoni is back to play for chennai super kings again

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ చేసిన ఓ పోస్టు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై రెండేళ్ల నిషేధం శుక్రవారం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు చెన్నై జట్టుకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా చెన్నై సూపర్‌కింగ్స్‌ జెర్సీ ధరించి దిగిన ఓ ఫొటోను తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటో కాస్త వైరల్‌గా మారింది.

7వ నెంబర్‌ జెర్సీ ధరించిన ధోనీ తన ఇంటి ముందు దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. జెర్సీపై తన పేరు ఉండాల్సిన స్థానంలో ‘తలా’ అని పేర్కొన్నాడు. తలా అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. ధోనీ పెట్టిన ఈ ఫొటోకి సోషల్‌మీడియాలో విపరీతమైన లైక్‌లు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి. గత రెండు సీజన్లలో ధోనీ రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కి ప్రాతినిథ్యం వహించాడు. 2017 ఐపీఎల్‌ ఫైనల్లో పుణె... ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2018 ఐపీఎల్‌ సీజన్‌ కోసం తమ పాత ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశముంటే.. మాజీ కెప్టెన్‌ ధోనీని వదులుకునే అవకాశమే లేదని చెన్నై ఫ్రాంఛైజీ ప్రతినిధి జాన్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Chennai super kings  CSK  Mahendra singh dhoni  MS Dhoni  N.Srinivasan  Indian premier league  cricket  

Other Articles