Virat Kohli sole Indian in Forbes list ఆ జాబితాలో దేశం నుంచి కోహ్లీ ఒక్కడే..

Virat kohli sole indian in forbes list of highest paid athletes

Kohli, Tiger Woods, Sachin Tendulkar, Roger Federer, Rafael Nadal, Novak Djokovic, Lionel Messi, LeBron James, Cristiano Ronaldo,​ Virat Kohli, icc champions trophy, cricket news, sports news, Team India, cricket

Indian cricket captain Virat Kohli is the sole sportsperson from the country to feature among the world's 100 highest paid athletes in the latest Forbes list topped by soccer star Cristiano Ronaldo

టీమిండియా కెప్టెన్ కోహ్లీకి మాత్రమే ఆ జాబితాలో స్థానం

Posted: 06/08/2017 04:28 PM IST
Virat kohli sole indian in forbes list of highest paid athletes

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడు మాత్రమే యావత్ భారతవని నుంచి ఆ జాబితాలో స్థానం సంపాదించాడు. ప్రతినిత్యం ఏదో ఒక అంశంపై ప్రపంచ వ్యాప్త సర్వేలు చేసి.. ఎప్పటికప్పడు వాటి వివరాలను ప్రజలకు ముందుకు తీసుకువచ్చే ఫోర్బ్స్ మ్యాగజీన్.. ఈ సారి నిర్వహించిన ఓ సర్వేలో యావత్ దేశం నుంచి కేవలం ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే స్థానం సంపాదించాడు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకునే టాప్ వంద మంది క్రీడాకారుల జాబితాలో భారత్ నుంచి విరాట్ కోహ్లి ఒక్కడే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.  

తాజాగా 'ది వరల్డ్స్ హైయస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్ ' 2017 జాబితాను ఫోర్బ్స్ విడుదల చేయగా, ఈ జాబితాలో సాకర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా 22 మిలియన్ డాలర్ల మర అదాయం అందుకుంటున్న రోనాల్డో భారతీయ కరెన్సీ విలువ ప్రకారం ఏఢాదికి రూ.141కోట్ల రూపాయల అదాయం కలిగివున్నాడు. కాగా ఇండియాకు చెందిన ఒక్క విరాట్ మినాయించి మరెవరూ ఈ జాబితాలో స్థానం సంపాదించలేకపోయారు.

విరాట్ కోహ్లీ ఈ జాబితాలో 89వ స్థానాన్ని దక్కించుకున్నాడు. విరాట్ ఆర్జించే పారితోషికాల్లో 3 మిలియన్ డాలర్ల వేతనం, విన్నింగ్స్, మరో 19 మిలియన్ డాలర్ల ఎండోర్స్ మెంట్స్ ఉన్నాయి. విరాట్ ను ఇండియన్ క్రికెట్ ఫెనోమ్ గా ఫోర్బ్స్ అభివర్ణించింది. కోహ్లి బ్యాటింగ్ లో రికార్డులు సృష్టిస్తున్నాడని కొనియాడింది. 2015లో భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ గా విరాట్ ను ఎంచుకున్నప్పడు, ఈ జాబ్ ను నిర్వర్తించే అత్యంత పిన్న వయసు ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపుపొందినట్టు పేర్కొంది.  
 
కాగా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రోనాల్డ్ 93 మిలియన్ డాలర్ల పారితోషికం పొందుతున్నారు. రెండో స్థానంలో బాస్కెట్ బాల్ స్టార్ లీబ్రోన్ జామ్స్ నిలిచారు. ఈయన పారితోషికం 86.2 మిలియన్ డాలర్లు. ఈ పారితోషికాల్లో ఆటగాళ్లు 2016 జూన్ నుంచి 2017 జూన్ వరకు పొందిన వేతనాలు, నగదు బహుమతులు, బోనస్ లు ఉన్నాయి. 21 దేశాల ఆటగాళ్లు ఈ టాప్ 100 లో ఉన్నారు. కాగా 63 మంది ఆటగాళ్లతో అమెరికా ఈ జాబితాలో ఆధిపత్యంలో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  highest paid athletes  Forbes list  icc champions trophy  India  bcci  cricket  

Other Articles