పూణే టెస్టులో విరాట్ సేన అస్త్రసన్యాసం..? గెలుపులకు బ్రేక్..! Australia beat India by 333 runs inside three days at first Test

India vs australia australia beat india by 333 runs inside three days at first test

india vs australia,india vs australia 2017, ind vs aus test, india vs australia pune test, Steve O’Keefe, ind vs aus first test, virat kohli, kl rahul, india, australia, cricket news, cricket score, cricket

Left-arm spinner Steve O’Keefe took 12 wickets in the match to help Australia beat India by 333 runs, as the tourists took a 1-0 lead in the four-Test series.

పూణే టెస్టులో విరాట్ సేన అస్త్రసన్యాసం..? గెలుపులకు బ్రేక్..!

Posted: 02/25/2017 05:08 PM IST
India vs australia australia beat india by 333 runs inside three days at first test

నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఫూణే వేదికగా మహరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పర్యాటక జట్టు అస్ట్రేలియాతో జారుగుతున్న టెస్టులో విరాట్ సేన అస్త్ర సన్యాసం చేసిందా..? అన్న అనుమానాలుకు తావిస్తుంది. వరుసగా ఐదు సిరీస్ లలో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా.. అసీస్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కంగారు బౌలర్లకు మోకరిల్లింది, గత నాలుగు సిరీస్ లలో వరుసగా ఆరువందలకు పైగా పరుగులు చేసిన టీమిండియా.. అసీస్ పై మాత్రం రెండు ఇన్నింగ్స్ లో కలపి కేవలం 212 పరుగులకు మాత్రమే చాప చుట్టేసింది. ఫలితంగా అసీస్ తొలిటెస్టులో 333 పరుగులతో ఘన విజయం సాధించింది.

మూడో రోజు ఆటలో భాగంగా 441 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. టీమిండియా ఓపెనర్లు మురళీ విజయ్(2) తో మొదలైన పతనకం కడవరకూ కొనసాగింది.  భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 107 పరుగులకే ఆలౌట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా మూడు రోజులు జరగకుండానే ముగిసింది. భారత ఆటగాళ్లలో చటేశ్వర పూజారా(31) మినహా  ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

ఆ తరువాత భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(10), విరాట్ కోహ్లి(13), అజ్యింకా రహానే(18)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు. ఏడుగురు భారత ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో చెలరేగిన ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ మరోసారి విజృంభించి భారత్ వెన్నువిరిచాడు. రెండో ఇన్నింగ్స్ లో ఓకీఫ్ ఆరు వికెట్లు సాధించి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత లయన్ నాలుగు వికెట్లు తీశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో పది వికెట్లు స్పిన్నర్లకే దక్కడం ఇక్కడ విశేషం.

అంతకుముందు రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగులకు ఆలౌటైన ఆసీస్ కు ఓవరాల్ గా 440 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆటలో భాగంగా 143/4 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ మరో 142 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. ఆసీస్ జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్(109;202 బంతుల్లో11 ఫోర్లు) శతకం సాధించాడు. ఈ రోజు ఆటలో మిచెల్ మార్ష్(31),వేడ్(20), మిచెల్ స్టార్క్(30)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, జడేజా మూడు, ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి. జయంత్ యాదవ్లకు వికెట్ దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  team india  asutralia  Steve O’Keefe  virat kohli  kl rahul  pune test  cricket  

Other Articles