టెస్టుల్లో విరాట్ కోహ్లీ అత్యల్ప స్కోరు ఎంతో తెలుసా..? Kohli 'worst batting performance in the last two years'

Kohli worst batting performance in the last two years

India, Australia, Virat Kohli, India vs Australia, Border-Gavaskar series, Test cricket, Steve Smith, Steve O'Keefe, india vs australia, cricket

India failed to bat for two complete sessions in both innings as they surrendered the first Test to Australia in the Pune Test

టెస్టుల్లో విరాట్ కోహ్లీ అత్యల్ప స్కోరు ఎంతో తెలుసా..?

Posted: 02/25/2017 05:52 PM IST
Kohli worst batting performance in the last two years

భారత స్టార్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తాజాగా ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి చేసిన మొత్తం పరుగులు 13. తొలి ఇన్నింగ్స్ లో విరాట్ డకౌట్ గా అవుటైతే.. రెండో ఇన్నింగ్స్ 13 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. ఇది స్వదేశంలో విరాట్ చెత్త ప్రదర్శనగా నమోదైంది.  స్వదేశంలో రెండు ఇన్నింగ్స్ ల్లో  బ్యాటింగ్ చేసి విరాట్ నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. అంతకుముందు ఎప్పుడూ స్వదేశంలో విరాట్ కోహ్లి రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి ఇంతకంటే తక్కువ స్కోరు ఎప్పుడూ నమోదు చేయలేదు.

మరొకవైపు 12ఏళ్ల తరువాత స్వదేశంలో భారత్ కు రెండో అతి పెద్ద టెస్టు పరాజయం ఇది. 2004లో నాగ్ పూర్లో ఆసీస్ తో జరిగిన టెస్టులో భారత్ 342 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తరువాత భారత్ మూడొందలకు పైగా పరుగుల తేడాతో ఓటమి పాలు కావడం ఇదే. ఈ మ్యాచ్ లో భారత్ 333 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 107 పరుగులకే ఆలౌట్ కావడంతో భారీ పరాజయం చవిచూసింది.

భారత ఆటగాళ్లలో చటేశ్వర పూజారా(31) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో చెలరేగిన ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ మరోసారి విజృంభించి భారత్ వెన్నువిరిచాడు. రెండో ఇన్నింగ్స్ లో ఓకీఫ్ ఆరు వికెట్లు సాధించి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి జతగా లయన్ నాలుగు వికెట్లు సాధించాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో ఓకీఫ్ 12 వికెట్లు సాధించగా, లయన్ ఐదు వికెట్లు తీశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles