117 ఏళ్ల రికార్డును బద్దలు కోట్టిన సమిత్ గోయల్ Gujarat's Samit Gohel breaks 117-year-old record

Samit gohel makes world record 359 for gujarat

samit gohel, ranji trophy records, cricket records, cricket batting records, ranji trophy records, samit gohel record, samit gohel, ranji scores, cricket news, sports news

Gujarat’s Samit Gohel made history by scoring 359 runs. It is the the highest unbeaten score by an opening batsman in first-class cricket.

117 ఏళ్ల రికార్డును బద్దలు కోట్టిన సమిత్ గోయల్

Posted: 12/27/2016 06:40 PM IST
Samit gohel makes world record 359 for gujarat

భారత క్రికెట్లో స్థానం కోసం వేచిచూస్తున్న యువ క్రికెటర్లు తమలోని ప్రతిభను చాటుతున్నారు. ఇప్పటికే జాతీయ జట్టులో అరంగ్రేటం చేసిన యువక్రికెటర్లు తమ సత్తా చాటుతున్న క్రమంలో ఇటు దేశవాలీ క్రికెట్ లో కూడా యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రంజీ ట్రోఫీలో వరల్డ్ రికార్డు నమోదైంది. గుజరాత్ ఓపెనర్ సమిత్ గోయెల్ విశ్వరూపం ప్రదర్శించి వరల్డ్ రికార్డు నమోదు చేశాడు.

ఒడిశాతో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో సమిత్ ట్రిపుల్ సెంచరీతో రికార్డులెక్కాడు. 723 బంతుల్లో 45 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 359 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో ఓపెనర్ గా 117 ఏళ్ల వరల్డ్ రికార్డును బద్ధలు కొట్టాడు. అంతకుముందు 1899 లో ఓవల్ లో సర్రే ఆటగాడు బాబీ అబెల్  నమోదు చేసిన 357 పరుగులే ఇప్పటివరకూ ఓపెనర్గా అత్యధిక వ్యక్తిగత స్కోరు.

గుజరాత్ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా సమిత్ 964 నిమిషాల పాటు క్రీజ్లో నిల్చుని ఈ రికార్డు సాధించాడు. చివరి రోజు ఆటలో భాగంగా 261 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన సమిత్ ఆద్యంతం సమయోచితంగా ఆడాడు. సుమారు 180 పరుగులను ఫోర్ల రూపంలో సమిత్ సాధించడం ఇక్కడ విశేషం. సమిత్ గోయెల్ ట్రిపుల్ తో గుజరాత్ 227.4 ఓవర్లలో 641 పరుగులు చేసింది. దాంతో గుజరాత్ 706 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి ఒడిశా వికెట్ నష్టానికి 81 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samit gohel  ranji trophy  gujarat  batting records  ranji trophy records  cricket  

Other Articles